హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ వారే: ఆర్మీ ఉద్యోగినంటూ మోసం (పిక్చర్స్)

తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నమ్మబలికి రైల్వే ప్రయాణికులకు టోపీ వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్మీ ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్‌లోని హిందీ మాట్లాడే నార్తు ఇండియన్‌ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మోసానికి తెర తీస్తాడు. ప్రయాణికులతో తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు పరిచయం పెంచుకుంటాడు.

అలా వారిని నమ్మించి వారి వద్ద ఉన్న బ్యాగుల్లో నుంచి ఏటీఎం కార్డులు, నగదును తస్కరిస్తున్న సంఘటన సికింద్రాబాదులోని గోపాలపురం ఠాణా పరిధిలో జరిగింది. హైదరాబాదు ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ కె. శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం, మీర్జాపూర్‌ జిల్లా, తాలుకా, భార్పురాకు చెందిన సునీల్‌ కుమార్‌ దుబెయి(26), ఇతడు 2014 నుంచి గార్మెంట్‌ ఫ్యాక్టరీలో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ఓసారి రైల్లో బల్లార్ష వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లో ఇతడితో పరిచయం అయిన వ్యక్తులు ఇతడిని మోసం చేసి అతడి బ్యాగులోని నగదును కాజేశారు.

అలా మోసపోవడంతో...

అలా మోసపోవడంతో...

మోసపోయిన సునీల్ కుమార్ దుబెయి అదే క్రమంలో ప్రయాణికులను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే నిర్ణయంతో హైదరాబాదు నగరానికి చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని మోండామార్కెట్‌ ప్రాంతంలో రూబీ హోటల్‌లో ఉంటూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫారం, టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఉండే ప్రయాణికులను గుర్తించి అందులో హిందీభాషను మాత్రమే మాట్లాడే ఉత్తర భారతీయులను పరిచయం చేసుకుంటాడు.

వారితో హిందీలో మాట్లాడి..

వారితో హిందీలో మాట్లాడి..

ఉత్తరాదివారితో తాను ఆర్మీలో పనిచేసేవాడినని నమ్మబలికించి తాను తయారు చేయించుకున్న గుర్తింపు కార్డును చూపిస్తాడు. తానే స్వయంగా తాళాలు ఇచ్చి బ్యాగులకు తాళం వేసుకోవాలని జాగ్రతలు తెలియజేస్తాడు. తాళం కొనుగోలు చేసే సమయంలో మూడు తాళాలు రాగా అందులో ఒక్కదాన్ని నొక్కేస్తాడు.

 తాళం అలా నొక్కేస్తాడు..

తాళం అలా నొక్కేస్తాడు..

మీ ఏటీఎంలో బ్యాలెన్స్‌ ఎంతుందో చెక్‌ చేసుకోమంటూ వారిని ఏటీఎం వద్దకు తీసుకుని వెళ్లిన సమయంలో పిన్‌ నంబర్‌ను గుర్తిస్తాడు. తిరిగి వచ్చిన అనంతరం అతడి జేబులోని నుంచే రూ.5వందల నగదును తీసి ఇచ్చి మంచినీళ్ల బాటిల్‌ను కొనుగోలు చేసుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు.

 వారు వచ్చేలలోగానే...

వారు వచ్చేలలోగానే...

వారు వచ్చేలోపు బ్యాగులో ఉన్న ఏటీఎం కార్డు, నగదు కాజేస్తాడు. వివిధ ఫిర్యాదుల మేరకు సీసీ కెమెరాల్లో ఇతడి రికార్డులను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మోండా మార్కెట్‌లోని రూబీ హోటల్లో ఉంటూ అతను ఈ మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి పోలీసులు 3 లక్షల 16 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Gopalpuram police have nabbed a man, who is cheating north Indians in railway stations posing as aramy man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X