బాబు-కెసిఆర్ భేష్: జైట్లీ ప్రశంస, బడి ఎగ్గొట్టిన పిల్లలు: కవిత ఫైర్

ఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడు ప్రశంసలు కురిపించారు. ఇరు ప్రభుత్వాలు నీటి ప్రాజెక్టుల విషయంలో భేష్‌గా ముందుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు.

జైట్లీ ఢిల్లీలో వాటర్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీలో నదుల అనుసంధానం భేష్ అని చంద్రబాబును మెచ్చుకున్నారు. తాగు, సాగు నీటి పథకాల పైన తెలంగాణ సర్కార్ బాగా దృష్టి సారించిందని కెసిఆర్ ప్రభుత్వానికి కితాబిచ్చారు.

బడి ఎగ్గొట్టిన పిల్లలు, పరీక్షలు రాయకుండా: కవిత

తెలంగాణ సీఎం కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సమయంలో టిడిపి, కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టారని, వారు ఓ విధంగా బడి ఎగ్గొట్టిన పిల్లలలాంటి వారు అని ఎంపీ కవిత అన్నారు. పరీక్షలకు బాగా ప్రిపేర్ కాని విద్యార్థులు ఏదో కారణం చెప్పి బడి ఎగ్గొడతారన్నారు. ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్ నేతలది అదే తీరు అన్నారు.

Arun Jaitley praises AP CM and Telangana CM

అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చిద్దామంటే ప్రతిపక్షాలు పారిపోయాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. ఇవాళ తెలంగాణభవన్‌లో చనిపోయిన టీఆర్‌ఎస్ కార్యకర్తలకు చెక్కులు అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు, ప్రాజెక్టులను కేసీఆర్ ప్రాణంకన్నా మిన్నగా చూసుకుంటారని తెలిపారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అన్నారు. దీనిపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరు కానీ ప్రతిపక్షాలు బయటకు పోయి ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారన్నారు.

సభకు రాకుండా ఎన్ని బయట ఎన్ని మాట్లాడినా విలువ ఉండదన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించిన నిధులెన్ని? అని నిలదీశారు. వాళ్ల హయాంలో మొబలైజేషన్ పేరుతో అడ్వాన్స్‌లు ఇచ్చారని, నాయకుల జేబులు నింపారన్నారు.

అలాంటి సంస్కృతి తమ తమ ప్రభుత్వానిది కాదన్నారు. ఆర్డీఎస్‌ను బద్దలు కొడుతుంటే మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ నేతలు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చర్చకు తాము ఎక్కడంటే అక్కడ సిద్దంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే టిడిపి నేతలు కెసిఆర్‌ను ప్రశ్నించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+