వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డదారిలో గెలిచి కాలక్షేపం చేస్తున్న అరవింద్.!ఎంపీ ఆటలు సాగనివ్వబోమని ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్/హైదరాబాద్: పసుపు బోర్డు ఎర్పాటుపై ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలతో టైంపాస్ చేస్తున్న ఎంపీ అరవింద్ ను ఇకనుండి వదిలేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించిరు. గెలిచిన మూడేండ్లలో పసుపు రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన అరవింద్ ను, 250 రూపాయల ఎంపీగా అభివర్ణించారు ఎమ్మెల్సీ కవిత. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తరో నిజమాబాద్ రైతులకు సమాధానం చెప్పాలని ఎంపీ అరవింద్ ను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత, గత మూడేండ్లుగా ఎంపీ అరవింద్ చేసిన మోసాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.

 రైతులను మోసం చేసిన అరవింద్.. మూల్యం చెల్లించక తప్పదన్న కవిత

రైతులను మోసం చేసిన అరవింద్.. మూల్యం చెల్లించక తప్పదన్న కవిత


నిజామాబాద్ జిల్లాలో రైతు సమస్యలకు రాజకీయ రంగుపులిమి, అనేక అబద్ధాలు చెప్పి, తప్పుడు హామీలు ఇచ్చి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలిచిందన్న ఎమ్మెల్సీ కవిత, మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అనేక విషయాలలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఎంపీ అరవింద్ సాధించిందేమీ లేదన్నారు. గెలిచిన వ్యక్తులకు కొంత సమయం ఇవ్వాలని భావించి, ఎంపీ అరవింద్ కు మూడు సంవత్సరాలు అవకాశం ఇచ్చామన్న ఎమ్మెల్సీ కవిత, ఇక నుండి ప్రతి గ్రామంలో పసుపు బోర్డు ఏర్పాటుపై అరవింద్ ను రైతులు నిలదీస్తారని తెలిపారు.

 మొదటి రోజు నుండే పసుపు బోర్డు కోసం ప్రయత్నించా.. కొన్ని కారణాల వల్ల తేలేకపోయానన్న కవిత

మొదటి రోజు నుండే పసుపు బోర్డు కోసం ప్రయత్నించా.. కొన్ని కారణాల వల్ల తేలేకపోయానన్న కవిత


2014 మే లో ఎంపీగా గెలిచాక, పసుపు బోర్డు సాధించాలని జూన్ 2014 నుండి 2018 జూన్ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహించానని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అప్పటి కేంద్ర కామర్స్ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం మొదలు,కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర , అస్సాం ముఖ్యమంత్రుల నుండి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కూడగట్టడం, నిజామాబాద్ ఎమ్మెల్యేలతో కలసి ప్రధాని మోదీని కలవడం లాంటి అనేక ప్రయత్నాలు చేసామన్నారు. అంతేకాక పసుపు బోర్డును డిమా చేస్తూ 2017 లో లోక్ సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టానని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని సైతం కోరామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

 ఉత్తుత్తి మాటలతో టైంపాప్.. అరవింద్ రైతులు తరిమికొడతారన్న కవిత

ఉత్తుత్తి మాటలతో టైంపాప్.. అరవింద్ రైతులు తరిమికొడతారన్న కవిత


ఓట్ల కోసం బాండ్ పేపర్ రాసిన ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేశారని, పసుపు రైతులు సాంగ్లీకి పోవాలంటూ ఎంపీ అరవింద్ ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలలో ఎంపీ అరవింద్ చేసిన ఘనకార్యాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తెప్చించానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్పైస్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ద్వారా పసుపు రైతుల కోసం ‌ 2020-21 లో ఒక కోటి 18 లక్షలు, 2021-22 లో రూ. 74 లక్షలు మాత్రమే కేటాయించారని, ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్సీ కవిత ఆధారాలతో సహా ప్రకటించారు.

 అడుగడుగునా అరవింద్ ను నిలదీస్తాం.. హెచ్చరించిన కవిత

అడుగడుగునా అరవింద్ ను నిలదీస్తాం.. హెచ్చరించిన కవిత


గత మూడేండ్లలో ఎంపీ అరవింద్ పసుపు మద్దతు ధర, పసుపు బోర్డు అంశాలపై పార్లముంటులో ఎప్పుడూ మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి అధర్మపురి అరవింద్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎర్రజొన్నకు మద్దతు ధర, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని బీజేపీ నేతలను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మూడు సంవత్సరాలుగా ఒపికతో ఉన్నామని, ఇక నుండి పసుపు రైతుల హామీలపై అరవింద్ ను వదిలేది లేదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బాండ్ పేపర్ లో చెప్పినట్టు పసుపు బోర్డు తీసుకురాకపోతే ప్రతి గ్రామంలో రైతులు ఎంపీ అరవింద్ ను నిలదీస్తారని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

English summary
MLC Kalwakuntla Kavita warns that MP Arvind, who has been passing the time with free advice and persuasive words on setting up a yellow board, will no longer be left out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X