వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమట్లు ఇష్యూ: ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక విసురుగా వెళ్లిపోయిన ఐలయ్య

తప్పుచేసిన వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఓ కులాన్ని కించపరిచేలా పుస్తకాలు రాయడం తప్పని ఒప్పుకుంటారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పలేక రచయిత కంచ ఐలయ్య విసురుగా లేచి వెళ్లారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తప్పుచేసిన వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఓ కులాన్ని కించపరిచేలా పుస్తకాలు రాయడం తప్పని ఒప్పుకుంటారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పలేక రచయిత కంచ ఐలయ్య విసురుగా లేచి వెళ్లారు.

చదవండి: 'రూ.లక్ష కోట్లు ఇస్తే ఏదైనా చేస్తానన్నారు, కంచ ఐలయ్య దేశద్రోహిగా స్పష్టం'

ఆయనను ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో కంచ ఐలయ్య సమాధానం చెప్పలేక విసురుగా వెళ్లిపోయారు. ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడినట్లుగా కనిపించింది.

ఈ ప్రశ్నకు జవాబేది?

ఈ ప్రశ్నకు జవాబేది?

తాను మొదటి నుంచి ఒకే ప్రశ్న అడుగుతున్నానని, అందరినీ ఒకేగాటన ఎలా కడుతున్నారని, దీనికి మీరు జవాబు చెప్పడం లేదని యాంకర్ ప్రశ్నించారు. దానికి కంచ ఐలయ్య.. తాను రీసెర్చ్ చేసి బుక్ రాశానని మాత్రమే చెప్పారు.

లేచి వెళ్లిపోయిన కంచ ఐలయ్య

లేచి వెళ్లిపోయిన కంచ ఐలయ్య

ఓ కులం వాళ్లు సామాజిక స్మగ్లర్లు అని కులం మొత్తంపై అభాండాలు వేయడం ఏమిటని అడగగా.. మొత్తం జ్యుడీషియరీకి వదిలి పెట్టాలని, పోలీస్ వ్యవస్థకు వదిలి పెట్టాలని, మీరు మరీమరీ ఇదే అడుగుతుంటే మాత్రం... ఐయామ్ గోయింగ్" అంటూ కంచ ఐలయ్య లేచి వెళ్లిపోయారు.

అడ్డుకున్నారు

అడ్డుకున్నారు

కాగా, ఐలయ్య పుస్తకంపై వైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనను ఎక్కడికి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాలలో శనివారం సాయంత్రం ఆయనను అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

సుప్రీం కోర్టుకు వెళ్తాం

సుప్రీం కోర్టుకు వెళ్తాం

తమ మనోభావాలను కించపరిచిన ఐలయ్యపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. కంచ ఐలయ్య బ్రాహ్మణులు, వైశ్యులతో పాటు హిందూమతాన్ని నీచ పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. కంచ ఐలయ్యలోని సైకో, కులాల మధ్య చిచ్చుపెట్టే వంటి దుర్మార్గమైన అనేక నైజాలను వెలికి తీయాల్సి ఉందన్నారు.

ఐలయ్యపై ప్రత్యక్ష చర్యలకు కార్యాచరణ

ఐలయ్యపై ప్రత్యక్ష చర్యలకు కార్యాచరణ

కంచె ఐలయ్యపై ప్రత్యక్ష చర్యలకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రకటించనున్నట్టు కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద చెప్పారు. అన్ని వర్గాల పెద్దలతో సమీక్షించిన తర్వాత ఐలయ్యపై ప్రకటన చేస్తామన్నారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయని పేర్కొన్నారు.

English summary
Arya Vysyas obstructed controversy writer Kancha Ilaiah in Warangal rural district on Satur Day evening for his boom on vysyas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X