వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రూ.లక్ష కోట్లు ఇస్తే ఏదైనా చేస్తానన్నారు, కంచ ఐలయ్య దేశద్రోహిగా స్పష్టం'

కంచ ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కంచ ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు.

దేశద్రోహిగా స్పష్టమవుతోంది

దేశద్రోహిగా స్పష్టమవుతోంది

ఐలయ్య వ్యవహారం హిందూ ధార్మిక వ్యవస్థనే ప్రశ్నించేలా మారిందని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఇస్తే ఏదైనా చేస్తానని ఐలయ్య టీవీ షోలో బహిరంగంగా మాట్లాడటం చూస్తుంటే ఆయన దేశద్రోహిగా స్పష్టమవుతోందన్నారు. మతం మారిన ఐలయ్యకు ఇంకో మతాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

ఇప్పుడు వారినే విమర్శిస్తావా

ఇప్పుడు వారినే విమర్శిస్తావా

దసరా నవరాత్రుల అనంతరం రాష్ట్రంలోని తమ గురువులు, అనుచరులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించి ఆ దిశగా ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. ఐలయ్యా! నీవు ప్రొఫెసర్‌వి కదా, నీకు మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు పాఠాలు నీ కులం వారే చెప్పారా అని నిలదీశారు. అనేక కులాలకు చెందిన గురువుల వద్ద చదువు నేర్చుకొని వారినే ఇప్పుడు విమర్శిస్తావా అన్నారు.

నేను ఆవును పూజిస్తా

నేను ఆవును పూజిస్తా

తనకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి తాను గోసేవ చేస్తున్నానని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. తాను ఇతరులను కించపరచనని చెప్పారు. నేను గోవుకు కాపలా కాస్తా, పేడ ఎత్తుతా, దానితో ఆడుకుంటానని చెప్పారు. దానిని ప్రతిరోజు పూజిస్తానన్నారు.

ఐలయ్య తీరుపై వైశ్య నేతల ఆగ్రహం

ఐలయ్య తీరుపై వైశ్య నేతల ఆగ్రహం

కాగా, టీవీ డిబెట్‌లో ఐలయ్య తీరు పైనా విమర్శలు వస్తున్నాయి. సామాజిక స్మగ్లర్లు కోమట్లు పుస్తకంపై టీవీ షోలో డిబెట్ జరిగింది. ఇందులో ఐలయ్య తీరుపై వైశ్య నేతలు తప్పుబట్టారు. సన్యాసులు తమ మూలాలు చెప్పుకోరని, కానీ ఐలయ్య ఆద్యంతం పదేపదే మీ మూలాలు చెప్పు.. మీ మూలాలు చెప్పాలని స్వామిని అడిగి అవమానించేలా వ్యవహరించారని మండిపడుతున్నారు.

ఇక, చరిత్రను తప్పుదోవ పట్టించరంటే ఎలా నమ్మాలి?

ఇక, చరిత్రను తప్పుదోవ పట్టించరంటే ఎలా నమ్మాలి?

ఐలయ్య ప్రశ్నించిన ఉత్పాదక రంగం గురించి స్వామి మంచి కౌంటర్ ఇచ్చారని, అలాగే, ఆవు, బర్రె విషయంలో ఐలయ్య స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం మండిపడ్డారు. బర్రె పాలు తాగితే మంచిది కాదని స్వామి చెప్పకుండానే ఐలయ్య ఆపాదించే ప్రయత్నం చేశారని, లక్షలాది మంది వీక్షించే లైవ్‌లోనే ఐలయ్య తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఇక చరిత్రను ఆయన తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు రాతలు రాయలేదని ఎలా అనుకోవాలని ప్రశ్నించారు.

English summary
Sree Peetham Paripoornananda Swami fired at writer Kancha Ilaiah on Satur Day for his book samajika smugglurlu komatollu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X