Rythu Bandhu: నేటి నుంచి రైతుల్లో ఖాతాల్లోకి రైతు బంధు..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా నేటి నుంచి రైతుల ఖాతాల్లో పదో విడత రైతు బంధు పైసాలు జమ కానున్నాయి. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా రైతులకు డబ్బులు జమ కాగా.. నేటి నుంచి మిగతా జిల్లాల అన్నదాతలకు పైసాలు రానున్నాయి. ఈ పథకంలో భాగాంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో వేస్తోంది.

కౌలు రైతులకు మాత్రం
ఇప్పటికే వానకాలనికి సంబంధించిన పైసాలను రైతు ఖాతాల్లో జమ చేసింది. తాజాగా యాసంగికి సంబంధించిన డబ్బులు నేటి నుంచి అన్నదాతల బ్యాంక్ అకౌంట్ లో వేయనున్నారు. అయితే రైతు బంధు పథకానికి ఎలాంటి నింబంధనలు లేవు. ఎంత భూమి ఉన్నా రైతు బంధు డబ్బులు వస్తాయి. కానీ కౌలు రైతులకు మాత్రం రైతు బంధు పైసాలు రావు.

70.54 లక్షల మంది
ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. మొదటగా ఎకరం ఉన్నవారికి రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. తర్వాత రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఇలా ఎంత ఉంటే క్రమంగా రైతు బంధు నిధులు విడుదల చేయనున్నారు.

వానాకాలం
మొత్తం పదో విడతతో కలిపి ఇప్పటివరకు రైతుబంధు కింద రూ.65,559.28 కోట్ల రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు రూ.7,434.67 కోట్ల రైతు బంధు నిధులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు.

అర్హులైన రైతులందరికీ
బుధవారం నుంచి పదో విడత రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో మంత్రి సింగిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం చెప్పారు. రైతులను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని అన్నారు.

కిసాన్ సమ్మాన్ యోజన
అటు కేంద్రం కూడా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోంది. ఈ రూ.6వేలను మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 12వ విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బలు చేసింది. అయితే ఈ పథకానికి పలు నిబంధనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications