హంతక ప్రభుత్వం.!రాబందుల ప్రభుత్వం.!దేశం నుంచి బీజేపిని తరిమికొట్టాలి.!నిప్పులు చెరిగిన కేసీఆర్.!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర బీజేపి ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో మాట మార్చిందని, స్థానిక బీజేపి నేతలు రైతాంగానికి అవాస్తవాలు చెప్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్నారని, ఇది కేంద్రప్రభుత్వ దుర్మార్గపు చర్య కాదా అని ప్రశ్నించారు. బీజేపిది కసాయి పాలన అని చెప్తూనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. చేతకాని అసమర్థుడు, దద్దమ్మ కిషన్ రెడ్డి అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, హంతక ప్రభుత్వమని దేశం నుంచి తరిమికొట్టాలని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

మెడల మీద కత్తి పెట్టే సంస్కృుతి కేంద్రానిది..
వరి దాన్యం కొనుగోలు అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దానికి కారణమవుతోంది. కొనుగోలు అంశంలో కేంద్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాసన చేసిందని, అందుకే రైతాంగం వరి పండించిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంటే, వరి కొనుగోలు విషయంలో లిఖితపూర్వకంగా అంగీకరించిన తర్వాత మళ్లీ వరి పండించి ఇప్పుడు కేంద్రం కొనాలని ఒత్తిడి తేవడం సమంజసం కాదని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అంశంలోనే ఇరు రాష్ట్రాలు ఒకదాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మద్యలో రైతాంగం మాత్రం తీవ్రంగా నలిగిపోతున్నట్టు తెలుస్తోంది. వరి ధాన్యాల గిడ్డంగులు లేక, కొనుగోలు లేక కల్లాల్లోనే రైతులు విలవిలలాడుతున్న పరిస్ధితులు తలెత్తాయి.

హంతక, రైతు వ్యతిరేక ప్రభుత్వం..
ఇదే అంశంపై సీఎం చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అభివృద్దిలో భారత్ దూసుకెళ్తుందని చెప్పుకుంటున్నకేంద్రానికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ఆకలి ఆర్తనాదాల్లో దేశం 102వ స్థానంలో ఉందని, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా వెనుకబడి ఉందని, సిగ్గుతో తలదించికోవాలని మండిపడ్డారు. రైతాంగ చట్టాలను తెచ్చి ఏడువందల మంది రైతుల మరణాలకు కారణమై చివరకు ఆచట్టాలను క్షమాపణ చెప్పీ మరీ రద్దు చేసిన ప్రభుత్వం బీజేపి అని, దీంతో కేంద్రానికి ఎంత ముందు చూపుందో అర్ధమవుతోందని ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వం హంతక ప్రభుత్వమని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని చంద్రశేఖర్ రావు ఘాటు ఆరోపణలు చేసారు.

యాసంగిలో వరి కొనేది లేదు..
దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రాబందుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యానికి కేంద్రం డబ్బులు ఇంకా ఇవ్వలేదని, మెడ మీద కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ కొనబోమని లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. వానాకాలంలో అరవై లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని, కానీ అందుకు కేంద్రం నిరాకరించిందని చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు.
దద్దమ్మ కేంద్ర మంత్రి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని చంద్రశేఖర్ రావు విమర్శించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తుంటే గుర్తుచేసి పోరాడాల్సిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చేతకాని తనమని మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రులకు కనీస గౌరవం ఇవ్వకుండా కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసారని, ఇంత అహంకారం ఎందుకని చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపి కార్యాలయంలో, కిషన్ రెడ్డి ఇంట్లో, ఢిల్లీ గేట్ దగ్గర వడ్లను పారబోసి వస్తామని చంద్రశేఖర్ రావు హెచ్చరించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications