పుట్టింటికి వెళ్లిన భార్య: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

హైదరాబాద్: ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన కనికే వివేకానంద(30) కొంతకాలం క్రితం నగరానికి వలసవచ్చి గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఈశ్వరయ్య నిలయంలో భార్య తేజస్వీతో కలిసి నివసిస్తూన్నాడు.

యాదగిరిగుట్ట ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదిన బార్య తేజస్వీ పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో భర్త వివేకానంద మాత్రమే ఉంటున్నాడు. సోమవారం వివేకానంద ఉండే గదిలోంచి దుర్వాసన వస్తుండడం, గత రెండు రోజులుగా తలుపులు వేసి ఉండడంతో పక్క ప్లాటు వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Assistant proffessor commits suicide in Hyderabad

దాంతో అక్కడకు చేరుకున్న రాయదుర్గం పోలీసులు బార్య తేజస్వీకి సమాచారం అందించి, తాళం పగులకొట్టి చూసే సరికి వివేకానంద బెడ్‌రూంలో ప్యాన్‌కు ఉరివేసుకొని అత్మహత్య చేసున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గత కొంతకాలంగా బార్యభర్తలు తరుచూ గొడవలు పడుతుండే వారని, ఈ నేపథ్యంలో అత్మహత్య చేసుకుని ఉంటాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివేకానంద శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని, ఈ నేపథ్యంలోనే మృతదేహాం దుర్వాసన వ్యాపించిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+