• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్టర్లతో కుమ్మక్కైన జ్యోతిష్యుడు .. తన జాతకం తెలుసుకోలేక అడ్డంగా బుక్ అయ్యాడు

|
Google Oneindia TeluguNews

రియల్టర్ల తో కుమ్మక్కైన ఓ జ్యోతిష పండితుడు మాఘ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని ప్రచారం మొదలు పెట్టాడు. గోపాలాయపల్లిలో ఉన్న రుక్మిణీ సత్యభామా సమేత వారిజాల వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే దోష నివారణ జరిగి వస్తుంది అంటూ ప్రచారం చేసాడు. ఇంకేం భక్తులు తండోపతండాలుగా గోపాలాయ పల్లికి బారులు తీరారు.

<strong>దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్</strong>దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్

గోపాలాయ పల్లి కి బారులు తీరిన భక్తులు... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

గోపాలాయ పల్లి కి బారులు తీరిన భక్తులు... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

పుణ్యం మాట దేవుడెరుగు.. లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో అక్కడికి వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. గుట్ట ఎక్కలేక మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. అంతేకాదు జ్యోతిష్యుల వారి పుణ్యమా అంటూ ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆలయం వైపు వెళ్లే దార్లన్నీ ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ తో స్తంభించి పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో ఎందుకు వచ్చారు? అసలేం జరిగింది అన్నది ఎంక్వైరీ చేస్తే జ్యోతిష్యుల వారి బాగోతం బయటపడింది.

రియల్టర్ల తో చేతులు కలిపిన జ్యోతిష్యుడు..

రియల్టర్ల తో చేతులు కలిపిన జ్యోతిష్యుడు..

గోపలాయ పల్లికి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న రియల్టర్ లు సమీప ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలు పెంచటం కోసం ఓ పథకం రచించారు. తన జ్యోతిషం ద్వారా బాగా ఫేమస్ అయిన సన్నిధానం లక్ష్మీ కాంతశర్మ ద్వారా టీవీ చానెల్ లో ప్రవచనాలు చెప్పించారు. రియల్టర్ల తో చేతులు కలిపిన జ్యోతిష రత్న సన్నిధానం లక్ష్మీ కాంతశర్మ రియల్టర్ల కోరిక మేరకు తప్పుడు సమాచారం ఇచ్చారు.

ఆ గుడికి వెళ్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రబోధ

ఆ గుడికి వెళ్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రబోధ

మాఘ అమావాస్య రోజు చాలా మంచిదని 89 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అమావాస్యతో పంచగ్రహాల దృష్టి ఈ పర్యాయం గోపలాయపల్లి స్టేజీ వద్ద ఉన్న వారిజాల వేణుగోపాలస్వామిపై పడుతుందని తన ప్రవచనంలో పేర్కొన్నారు.ఆ రోజున స్వామిని దర్శించుకుంటే శుభసూచకమని.. సంతాన, ఐశ్వర్య, ఆరోగ్య ఫలాలు కలుగుతాయని చెప్పారు. ఇంకేం రాష్ట్రంలో ఉన్న భక్తులు సగంమంది జ్యోతిష్యుల వారు చెప్పిన ప్రవచనం తో గోపలాయ పల్లికి దండు కట్టారు . దీనికి తోడు గుట్టపై మారుతి సేవా సమితి ఆధ్వర్యంలో కూడా నవ నాగదత్త హోమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా మంగళవారం ఎక్కువకు ఎక్కువ 20వేలకు మించి భక్తులే వస్తారని అంచనా వేశారు. అయితే.. తెలంగాణ, ఏపీల నుంచే కాకుండా తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అనుమానంతో పోలీసుల ఆరా .. జ్యోతిష్యుడి గుట్టు రట్టు

అనుమానంతో పోలీసుల ఆరా .. జ్యోతిష్యుడి గుట్టు రట్టు

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ దేవాలయానికి భక్తులు రావడంపై ఆరా తీసిన పోలీసు బాసులు జ్యోతిష్యుడు గుట్టు రట్టు చేశారు. అమావాస్య ప్రాశస్త్యంపై లక్ష్మీకాంత శర్మ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చేశారు. లక్ష్మీకాంత శర్మ కాల్‌డేటా వివరాలు పరిశీలించిన తర్వాత స్థానికంగా గుడికి ప్రాచుర్యం కల్పించి సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పెంచడానికే ఈ దోష నివారణ ప్రచారం చేశారని గుర్తించారు. ఈ మేరకు జ్యోతిష్య పండితుడు లక్ష్మీకాంతశర్మ, దేవాలయ ట్రస్టీ కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిపై ఐపీసీ 420, 342 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రియల్టర్ల హస్తంపైనా విచారణ చేస్తున్నారు. మొత్తానికి అందరి జాతకాలు చెప్పే జ్యోతిష్యుల వారు తన జాతకం ఇట్లా మలుపు తిరుగుతుందని ఊహించకపోవటం కొసమెరుపు.

English summary
An astrologer who had joined hands with the realtors was booked in the police case. he announced in tv channels "Magha amavasya is a good day , and at the time of the visit of the varijala venugopalaswamy at Gopalayapalli is gives health and wealthy" . Devotees have been caught by the astrologer who made this announcement to develop real estate business in near by areas. The suspicion came and the police who had filed a case against the astrologer and the realtors who were involved in this .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X