వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సంస్థ స‌ర్వేలు ఎప్పుడూ నిజ‌మే... తెలంగాణ‌లో ప్ర‌ధాన పార్టీకి బిగ్‌షాక్‌?

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ‌లో మాత్రం రాజ‌కీయ వేడి కాక‌పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి, కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌ధ్య రాబోయే ఎన్నిక‌ల్లో హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని అనేక స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఒక‌వైపు బీజేపీతో, మ‌రోవైపు కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తోంది. కాంగ్రెస్ స‌వాల్ విసురుతుండ‌గా , బీజేపీ సమర శంఖం పూరిస్తోంది.

 ఆగస్టు 15వ తేదీకి పూర్తిస్థాయి స్పష్టత

ఆగస్టు 15వ తేదీకి పూర్తిస్థాయి స్పష్టత


ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌తి నెల‌కు ఒక స‌ర్వే నిర్వ‌హించి నివేదిక అంద‌జేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఈ రాష్ట్రానికి ఒక్క‌దానికే వ్య‌క్తిగ‌తంగా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా జిల్లాల అధ్య‌క్షుల‌తో, ఎమ్మెల్య‌తో స‌ర్వే నిర్వ‌హింప‌చేస్తోంది. వ‌చ్చే నెల 15వ తేదీకి రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితి ఏమిట‌నేదానిపై ఒక స్ప‌ష్ట‌త రానుంది. ఈలోగా ఏ సంస్థ‌కా సంస్థ స‌ర్వేలు నిర్వ‌హించి సొంతంగా ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్నాయి.

 రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం

'ఆత్మసాక్షి' గ్రూప్ త‌న సర్వే వివ‌రాల‌ను ప్రకటించింది. రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌దే గెలుపని ఆ సర్వేలో వెల్ల‌డైంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం.. టీఆర్ ఎస్‌కు 56 నుంచి 59 స్థానాలు ద‌క్క‌బోతున్నాయి. ఓట్ల శాతం 39.5 గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 37 నుంచి 39 స్థానాలు ద‌క్క‌బోతున్నాయి. ఓట్ల శాతం 31.5 గా ఉంది. ఇక టీఆర్ ఎస్‌ను హోరాహోరీగా ఢీకొడుతున్న బీజేపీకి 14 నుంచి 16 సీట్లు రానున్నాయ‌ని తెలిపింది. ఓట్ల శాతం 21 వ‌ర‌కు ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మరీ విఫలమవతోన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా నిరాశ తప్పదని సంస్థ సర్వే వెల్లడించింది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ లాంటిదే.

 టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు

టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీఆర్ ఎస్‌-కాంగ్రెస్ మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడు పార్టీల మ‌ధ్య త్రిముఖ పోరు జ‌రుగుతుంద‌ని తెలిపింది. రాష్ట్రం మొత్తం 1.88 ల‌క్ష‌ల శాంపిల్స్ తీసుకున్నామ‌ని సంస్థ తెలిపింది. ఈ సంస్థ గ‌తంలో చేసిన చాలా స‌ర్వేలు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక్క ఉత్త‌ర‌ప్రదేశ్‌లో మాత్రం ఆత్మసాక్షి అంచ‌నా త‌ప్పింద‌ని తెలిపారు. వాస్త‌వానికి ఏ సంస్థ స‌ర్వేలు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌లేక‌పోతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ వివ‌రాల‌ను అధికార‌, ప్ర‌తిపక్షాల‌ను ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తాయ‌న్న‌దే చూడాలి.

English summary
In the Atmasakshi survey, it has once again been revealed that Telangana Rashtra Samithi is the title of the people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X