కమిషనర్ లేట్: జాతీయ జెండాను ఆవిష్కరించిన అటెండర్ (ఫొటో)
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ దేవీ సింగ్‌నాయక్ నిర్ణీత సమయానికి రాకపోవడంతో అక్కడున్నవారంతా అటెండర్ బుచ్చయ్యతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారంనాడు జాతీయ జెండాను ఆవిష్కరింప చేశారు.
జాతీయ జెండాకు అవమానం జరుకూడదనే ఉద్ధేశంతోనే జెండాను ఆవిష్కరింపజేసినట్లు సిబ్బంది వివరించారు. అయితే పలు కార్యక్రమాల వల్ల సమయానికి రాలేకపోయానని, తాను వస్తున్నానని ఫోన్‌లో సమాచారం అందించినప్పటికీ పలువురు ఉద్దేశపూర్వకంగానే అటెండర్‌తో జెండాను ఆవిష్కరించారని కమిషనర్ అన్నారు.

గణతంత్ర దినోత్సవం నాడు అధికారులే పతాకావిష్కరణ చేయాల్సి ఉంటుందనే విషయం తెలిసి కూడా కమిషనర్ సమయానికి రాకపోవడంపో పురప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ టికె శ్రీదేవి విచారణకు ఆదేశించారు.
ఎస్టీ అధికారిని అనే దురుద్దేశంతోనే పతాకావిష్కరణలో తనను అవమానపరిచారని కూడా దేవీ సింగ్ నాయక్ అన్నారు. అటెండర్‌తో పతాకావిష్కరణ చేసి సోషల్ మీడియాలో చేసిన ప్రచారం తనను కలిచి వేసిందని అన్నారు.












Click it and Unblock the Notifications