పెట్రోల్ పోసి ఆటో డ్రైవర్‌ను తగులబెట్టిన దుండగులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శనివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఆటో డ్రైవర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ హనుమంతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
రంగారెడ్డి జిల్లాలోని షాపూర్ నగర్ ఆటో స్టాండు వద్దకు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆటో డ్రైవర్‌తో కొద్దిసేపు మాట్లాడారని, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని చెబుతున్నారు. మిగతా ఆటో డ్రైవర్లు అక్కడికి చేరుకునేలోగా దుండగులు పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనకు గల కారణాలు తెలియలేదు.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
హైదరాబాద్ నగరంలోని అల్వాల్ గల రైల్వేస్టేషన్లో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతిచెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు వెంకటాపురంలో గల వందన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications