ఆటోలో ఎక్కించుకుని వెళ్లి బాలికపై డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్‌: పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని ఓ బాలిక శీలాన్ని ఓ ఆటో డ్రైవర్ కొల్లగొట్టాడు. మాయమాటలు చెప్పి అతను బాలికను లొంగదీసుకున్నాడు. తన ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

సోమవారం రాత్రి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్‌ వద్ద పనిచేసే వ్యక్తికి 14 ఏళ్ల కూతురు ఉంది. 8వ తరగతి చదువుతూ మధ్యలోనే ఆపేసింది. గత కొన్ని రోజులుగా ఇంటివద్దే ఉంటోంది.

Auto driver rapes a girl at Uppal in Hyderabad

బాలిక ఇంటి సమీపంలో అడ్డాలో ఆటోను నిలుపుకొని ఉండే పటేల్‌నగర్‌కు చెందిన రాజేష్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఫిబ్రవరి 29వ తేదీ రాత్రి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఏసీపీ రవిచందన్‌రెడ్డి కేసును పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+