నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం: 18 మందితో బావిలో పడిన ఆటో, 10మంది మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 18 మందితో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ సంఘటన ఆదివారం ముప్కాల్ నుంచి మెండారోకు వెళ్తుండగా చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా 10మంది మృతి చెందారు.

మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెండోరా సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న ఈ బావిలో ఆటో అదుపు తప్పడంతో బావిలో పడింది.

అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications