హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లు.. మరో గచ్చిబౌలిగా ఆ ప్రాంతం..
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే భాగ్యనగరంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. హైదరాబాద్ లో ఐటీ రంగంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గత పదేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొండాపూర్ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి.
హైదరాబాద్ లో ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా ఉన్నాయి. వాటితోపాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీయ సంస్థలు పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ ఇప్పటికే సుమారు రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో భారీ డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టింది. భవిష్యత్తులో మరో రూ. 60 వేల కోట్ల పెట్టుబడులతో సేవల విస్తరణకు సిద్ధమవుతోంది.
రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలోని కందుకూరులో సుమారు 48 ఎకరాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఈ ఏరియాలోనే భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా జరగనుంది. దాంతో ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ ప్రాంతం అటు ఫార్మా సిటీకి సైతం దగ్గరలో ఉంది.
ఇక రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలోని షాబాద్ వద్ద మైక్రోసాఫ్ట్, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రేట్లను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. త్వరలోనే ఇది భారీ ఐటి- డేటా ఇన్ ఫ్రా జోన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ మైక్రోసాఫ్ట్, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రావిర్యాలలో ఫ్యాబ్ సిటీ సమీపంలోనూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది ప్రధాన హబ్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications