ఒకేసారి విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ (వీడియో)
Ayodhya Ram Mandir: ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సామాజికం, సినిమా, క్రీడారంగానికి చెందిన సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకున్నారు.
Recommended Video

#WATCH | Telangana | Actor Ram Charan leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.
— ANI (@ANI) January 22, 2024
He says, "It's a long wait, we are all very honoured to be there." pic.twitter.com/6F4oBZylS8
ఈ మహోత్సవంలో పాల్గొనడానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వారికి ఆహ్వానపత్రికలు స్వయంగా అందించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్.. అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
#WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.
— ANI (@ANI) January 22, 2024
He says, "That is really great. Overwhelming. We feel it's a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ
ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను ఆంజనేయుడి భక్తుడినని, ఆయనే స్వయంగా తనను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందుకోవడం, ప్రాణ ప్రతిష్ఠలో భాగస్వామిని కాబోతోండటం.. జీవితకాలం అవకాశమని పేర్కొన్నారు.
Boss ,Charan Babu & Family Off to Ayodhya#MegastarChiranjeevi #RamCharan pic.twitter.com/9Hc81prO24
— Praveen (@AlwaysPraveen7) January 22, 2024












Click it and Unblock the Notifications