Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

4ఏళ్ల స్నేహం తర్వాత బాబు దిక్కారం.!7ఏళ్ల స్నేహం తర్వాత కేసీఆర్ దిక్కారం.!ఏపి ఫలితం తెలుసు.!మరి ఇక్కడ.?

హైదరాబాద్ : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు. కాని రాజకీయాల్లో శత్రుత్వానికి మాత్రం అనేక జన్మలుంటాయని తెలుస్తోంది. రాజకీయ పార్టీల మద్య స్నేహం చిగురించే మాట పక్కన పెడితే శత్రువుగా మారే అంశాలు మాత్రం క్షణక్షణం ఉద్బవిస్తూనే ఉంటాయి. స్నేహపూర్వక సుదీర్గ ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ రెండు రాజకీయ పార్టీల మద్య వివాదాలు రాజుకోవడానికి మాత్రం రెప్పపాటు కాలం పట్టదు. ఏపిలో 2014 ఎన్నికల తర్వాత కేంద్ర బీజేపితో నాలుగేళ్లు స్నేహం చేసిన నారా చంద్రబాబు నాయుడు విడిపోవడానికి క్షణం పట్టలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితం ఏంటో అందరికి తెలిసిందే.!

కేంద్ర బీజేపిపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. సీఎం వ్యవహారంతో మారుతున్న పరిణామాలు..

కేంద్ర బీజేపిపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. సీఎం వ్యవహారంతో మారుతున్న పరిణామాలు..

ప్రస్తుతం తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు ఏడేళ్లుగా బీజేపితో స్నేహ పూర్వకంగా ఉండి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపి పైన చంద్రశేఖర్ రావు చేసిన ఘాటు వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా చర్చ జరుగుతోంది. కేంద్ర బీజేపితో వైరం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు పరిస్ధితి రెండు తెలుగురాష్ట్రాలకు తెలిసిందే.! ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రశేఖర్ రావు పరిస్థితి ఏంటనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.

ఏపిలో చంద్రబాబు చేసినట్టే.. తెలంగాణలో కూడా మోదీతో వైరం పెట్టుకుంటున్న కేసీఆర్

ఏపిలో చంద్రబాబు చేసినట్టే.. తెలంగాణలో కూడా మోదీతో వైరం పెట్టుకుంటున్న కేసీఆర్

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కేంద్రంతో నాలుగేళ్ల సాహవాసానికి చంద్రబాబు నాయుడు తిలోదకాలిచ్చారు. ఏపి కి ప్రత్యేక హోదా, కేంద్ర బడ్జెట్ లో ఏపికీ కేటాయింపులు, విభజన హామీల అంశంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించి, మంత్రి పదవులను కూడా వదులుకుని బీజేపితో స్నేహాన్ని వద్దనుకున్నారు చంద్రబాబు. ఆతర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని ఓటమిని చవిచూసింది. అది ఏపి వ్యవహారం. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇవే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాదారణ ఎన్నికలు ఏడాది, ఏడాదిన్నర వ్యవధి ఉన్న తరుణంలో సీఎం చంద్రశేఖర్ రావు మోదీ ప్రభుత్వంపై, బీజేపి విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు.

బీజేపిని బంగాళాఖాతంలో కలపాలి.. సాహసోపేత ప్రకటన చేసిన కేసీఆర్

బీజేపిని బంగాళాఖాతంలో కలపాలి.. సాహసోపేత ప్రకటన చేసిన కేసీఆర్

చంద్రబాబు కన్నా ఓ అడుగు మందుకేసి బీజేపి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని దేశ ప్రజలకు చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. సేమ్ చంద్రబాబు చూపించిన కారణాలనే చంద్రశేఖర్ రావు ఎత్తి చూపిస్తూ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపుల అంశంలో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు చంద్రశేఖర్ రావు. దేశానికి పట్టిన చీడగా బీజేపిని అభివర్ణించారు చంద్రశేఖర్ రావు. బీజేపి పాలనను అంతం చేయడానికి నూతన రాజ్యాంగ ఆవశ్యకత ఉందని సంచలన విమర్శలు చేసారు చంద్రశేఖర్ రావు. బీజేపిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ఓ బలమైన రాజకీయ శక్తి అవసరమని, ఆ శక్తి కోసం తాను ముందుండి పోరాడతానని చంద్రశేఖర్ రావు సాహసోపేత ప్రకటన చేసారు.

Recommended Video

    CM KCR కొత్త రాజకీయ నినాదం Third Front ధీమా | Budget 2022| BJP VS CNG | Oneindia Telugu
    వచ్చే ఎన్నికల్లో బీజేపికి ప్రతికూల ఫలితాలు.. లేకపోతే బాబు లాగే కేసీఆర్ కూడా...?

    వచ్చే ఎన్నికల్లో బీజేపికి ప్రతికూల ఫలితాలు.. లేకపోతే బాబు లాగే కేసీఆర్ కూడా...?

    దేశ ఆర్ధిక మూలాలను విచ్చిన్నం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దేశంలోని మేదావులు ఈ అంశాన్ని గ్రహించాలని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. దేశం సమగ్ర వృద్ది సాధించాలంటే బీజేపిని ఓడించాలని స్పష్టం చేసారు. ఇంతవరకూ కథ బాగానే ఉన్నప్పటికి సాధారణ ఎన్నికల ముందు కేంద్ర బీజేపిపై ప్రకటించిన యుద్దం ఎంతవరకు అనుకూల ఫలితాలనిస్తుంది. చంద్రశేఖర్ రావుకు పూర్తి అవగాహన ఉండి మోదీ పై పోరాటానికి సన్నధ్దం అయ్యారా.?లేక క్షణికావేశంలో బీజేపిని నిందుస్తున్నారా అన్నది తేలాల్సిఉంది. ఒక వేళ నిజంగా మోదీ ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపికి దేశ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావాలి. లేదంటే ఏపీలో చంద్రబాబుకు ఎదురైన అనుభవం చంద్రశేఖర్ రావు చవిచూడాల్సి వస్తుందనే చర్చ ఊపందుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+