హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంపులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి: బచ్‌పన్ స్కూల్ సీజ్

మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బాలల దినోత్సవం రోజున రెండున్నరేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం బాలల దినోత్సవం రోజున రెండున్నరేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

యాజమాన్యానిదే తప్పు

యాజమాన్యానిదే తప్పు

దీనిపై చిన్నారి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. అదే రోజు విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపారు. ఈ విచారణలో యాజమాన్యానిదే తప్పు అని తేలింది.

పాఠశాల సీజ్ చేశారు

పాఠశాల సీజ్ చేశారు

దీంతో విద్యాశాఖ అధికారులు గురువారం నాడు స్థానిక విద్యాశాఖ అధికారులకు పాఠశాలను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో దానిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.

నిర్లక్ష్యం: స్కూల్ సంప్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి నిర్లక్ష్యం: స్కూల్ సంప్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి

పలువురి అరెస్ట్

పలువురి అరెస్ట్

ప్రిన్సిపల్ రాఘవేంద్ర, స్కూల్ కౌన్సెలర్ ఉన్ని కృష్ణన్, వాచ్‌మన్ ప్యాట్రిక్‌లను అరెస్టు చేశారు. కాగా, సంప్‌లో పడి రెండున్నరేళ్ల శివ చనిపోయాడు, అతను నర్సరీ చదువుతున్నాడు.

నీటి సంపు తెరిచి ఉండటం వల్లే

నీటి సంపు తెరిచి ఉండటం వల్లే

బాలల దినోత్సవం రోజున స్కూల్లోని నీటి సంపు తెరిచి ఉంది. దాని పైన మూత లేకపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

English summary
For two-and-a-half-year-old Nama Shiva Rachith and his parents, Children’s Day was a day of mourning and not celebration. Nama Shiva attended Bachpan Play School located at RK Nagar in Malkajgiri. On Tuesday he was found to have drowned in the underground water sump located within the school’s premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X