వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లకుబేరుల పేర్లు బట్టబయలు: ‘బహమాస్’ లీక్స్‌లో తెలుగు ప్రముఖులు వీరే?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'పనామా' లీక్స్ తరహాలోనే 'బహమాస్' లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. బహమాస్ లీక్స్ పేరుతో అక్రమార్కుల డేటాను ఇంటర్నేషనల్ కనార్షియం ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఐసీఐజే) బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 75 వేల మంది ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

వీరంతా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే అవకాశం ఉంది. 1990 నుంచి 2016 వరకు కంపెనీలు పెట్టిన వారి జాబితా వివరాలను బహమాస్ లీక్స్‌‌తో జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. బహమాస్ లీక్స్ నల్లకుబేరుల గుట్టుని రుట్టు చేస్తున్నాయి. ఒక్క భారత్‌ నుంచి 475 మంది పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా బహమాస్ లీక్స్ పేర్కొంది. దీంతో మన దేశంలో 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలయ్యాయి.

Bahamas files leaks expose politicians' offshore links

బహమాస్ లీక్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. జాబితాలో నిమ్మగడ్డ ప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రకాష్‌ కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలు కంపెనీలు సైతం జాబితాలో ఉన్నాయి. పన్నురహిత దేశంగా పేరుపొందిన బహమాస్‌‌‌లో భారతీయులు సూట్ కేసు కంపెనీలు పెట్టారు.

బహమాస్‌కు చెందిన పలు కంపెనీల్లో నల్లధనం పేరిట పెట్టబడులు పెట్టినట్లుగా బహమాస్ లీక్స్‌లో ఐసీఐజే వెల్లడించింది. గతంలో పనామా లీక్స్ ద్వారా వందల మంది అక్రమాస్తుల డేటాను ఐసీఐజే బయటపెట్టిన సంగతి తెలిసిందే.

బహమాస్ లీక్స్‌లో వేదాంద గ్రూప్‌కు చెందిన అనీల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫ్యాషన్ టీవీ అమాన్ గుప్తా పేరు కూడా ఉన్నట్లు బహమాస్ లీక్స్ ద్వారా వెల్లడైంది. సంజీవ్ కపూర్, జితేంద్ర పాత్రా, రఫిక్ ముల్తానీ పేర్లు బయటికి వచ్చాయి. బహమాస్ లీక్‌‌లో పేర్లున్న వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అంతేకాకుండా బహమాస్‌లో బోగస్‌ కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రముఖులు పేర్లు బయటపడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్లో కొందరు సికింద్రాబాద్‌లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు 'బహమాస్ ' లీక్స్ బయటపెట్టింది. ఇక బహమాస్ విషయానికి వస్తే అట్లాంటిక్‌ మహా సముద్రంలోని చిన్న దేశం. ఇది ద్వీపాల సముదాయం.

English summary
In the digital age, offshore secrets are hard to keep. In its latest revelations, the Guardian is publishing investigations based on the leak of 1.3m internal files from the company register of the Bahamas, one of the world’s most notorious tax havens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X