అత్యాచారాలు పెరగడం ఆందోళనకరంగా ఉంది: హీరో బాలకృష్ణ
హైదరాబాద్: అత్యాచారాలు పెరగటం అందోళనకరమని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో మంగళవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం క్యాన్సర్ బాధితులతో కాసేపు గడిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్యనిర్వాహణాధికారి ఆర్ పీ సింగ్, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ సీహెచ్ సత్యన్నారాయణ, డాక్టర్ కల్పనా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications