వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?

|
Google Oneindia TeluguNews

హుజూర్‌నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. హుజూర్ నగర్ ఓటర్ల మనసు గెలుచుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . ఇక కాంగ్రెస్ పార్టీ కి కోదండరాం మద్దతు ప్రకటించారు. ఇక టీడీపీ సైతం బరిలో ఉన్ననేపధ్యంలో బాలయ్య రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే గత ఎన్నికల్లోనూ బాలయ్య ప్రచారం చేసినా ఎలాంటి ఫలితం రాలేదని బాలయ్య చరిష్మా తెలంగాణలో పని చెయ్యలేదని టాక్ వినిపిస్తుంది.

 బాలయ్య టార్గెట్ గా రాయలసీమపై ఫోకస్ పెట్టిన జగన్ ... టీడీపీలో టెన్షన్ బాలయ్య టార్గెట్ గా రాయలసీమపై ఫోకస్ పెట్టిన జగన్ ... టీడీపీలో టెన్షన్

 గఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య .. పని చెయ్యని చరిష్మా

గఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య .. పని చెయ్యని చరిష్మా

ఇక హుజూర్ నగర్ లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా టీడీపీ సైతం హుజూర్ నగర్ లో బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ తో స్నేహం చేసి మహాకూటమి పొత్తులతో పోటీ చేసే చావు దెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణా ఎన్నికల బరిలోకి దిగి సాహసమే చేసింది. కానీ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగి పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందో తేల్చుకోనుంది. అంతే కాదు ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతో తలపడాలని నిర్ణయం తీసుకుంది.అందుకే సెటిలర్స్ టార్గెట్ గా బాలయ్య రంగంలోకి దిగి ప్రచారం చెయ్యనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలయ్య కూకట్ పల్లి నుండి ఎన్నికల బరిలోకి దిగిన హరికృష్ణ కూతురు సుహాసిని కోసం ఎన్నికల ప్రచారం సాగించారు. అంతే కాదు ఖమ్మంలోనూ బాలయ్య ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో సాంద్ర వెంకట వీరయ్య , మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించినప్పటికీ ఒకప్పటి ఫలితాలు ఖమ్మంలో రాలేదనే చెప్పాలి. ఇక సుహాసిని అయితే ఎంత ప్రచారం చేసినా, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఓటమి పాలయ్యారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్

ఇక తాజాగా సీపీఎం ను తమకు మద్దతు ఇవ్వాలని కోరింది టీడీపీ . కానీ సానుకూల స్పందన రాలేదు. ప్రధానంగా హుజూర్ నగర్ లో దాదాపు 50 వేల మంది సెటిలర్స్ ఉన్నారని అంచనా వేస్తున్న నేపధ్యంలో సెటిలర్స్ ఓటు బ్యాంకు కోసం, అలాగే సామాజిక సమీకరణాల నేపధ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ సైతం హోరాహోరీగానే పోరాటం చేస్తుంది. ఇక హుజూర్ నగర్ ఎన్నికల విషయంలో చంద్రబాబు సైతం ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ను రంగంలోకి దించనున్నారు. కానీ బాలయ్య ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

హుజూర్‌నగర్ లో ప్రచారానికి ఓకే అన్న బాలయ్య.. 13 నుండి ప్రచారం

హుజూర్‌నగర్ లో ప్రచారానికి ఓకే అన్న బాలయ్య.. 13 నుండి ప్రచారం

ఇక ఈ నేపధ్యంలోనే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి తరపున ప్రచారం చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్న కిరణ్మయి ప్రచారం సాగిస్తున్నారు . ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి బాలకృష్ణ పర్యటన సాగుతుందని, ఐదు నుంచి ఆరు రోజులు ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

బాలయ్య ప్రచారం ఓటు బ్యాంకుగా మారుతుందన్న నమ్మకం టీడీపీలో ఉందా ?

బాలయ్య ప్రచారం ఓటు బ్యాంకుగా మారుతుందన్న నమ్మకం టీడీపీలో ఉందా ?

హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయిన నేతలు బాలకృష్ణ పర్యటన, ప్రచారం గురించి చర్చించారు. బాలకృష్ణ ప్రచారం చేస్తే పార్టీ శ్రేణుల్లో జోష్ వస్తుందని భావిస్తున్న నేపధ్యంలోనే బాలయ్యను ప్రచారానికి దించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ బాలయ్య ఎన్నికల ప్రచారం టీడీపీకి ఓటు బ్యాంకుగా మారుతుంది అన్న నమ్మకం తెలుగు తమ్ముళ్ళకు సైతం లేదు . ఉనికి చాతుకోవటం తప్ప ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి మరో మార్గం లేదు . ఇక తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం టీడీపీలో పునరుత్తేజం నింపుతుందా క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగానే ఉందని భావిస్తున్న నేపధ్యంలో బాలయ్య ప్రచారం టీడీపీకి ఓటు బ్యాంకుగా మారితే బాగుంటుంది అని టీడీపీ భావిస్తుంది.కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే అని రాజకీయ విశ్లేషకుల భావన .

English summary
Hindupuram MLA Nandamuri Balakrishna seems to have agreed to campaign for the Telugu Desam Party candidate Chava Kiranmai in the Huzurnagar by-election. It is reported that Balakrishna will be campaigning from Sunday the 13th of this month and will be campaigning for five to six days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X