ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బండ ప్రకాష్.!అభినందించిన మంత్రులు.!
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా ఎన్నికైన డాక్టర్ బండ ప్రకాష్ బుధవారం నాడు పదవీ ప్రమాణం చేశారు.ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బండ ప్రకాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్ ని అభినందించిన రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి మహమూద్ అలీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ప్రభాకర రావు, బొడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తదితరులతో కలిసి హాజరై, అనంతరం ఆయనను శాలువాతో సత్కరించిన మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. సమర్థుడైన బండా ప్రకాశ్ కి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంచి అవకాశం కల్పించారన్నారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా విధులు నిర్వర్తించాలని, అటు ప్రభుత్వానికి, ఇటు శాసన మండలికి, మంచి పేరు తెచ్చే విధంగా పని చేయాలని ఆకాంక్షించారు. అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ బండ ప్రకాష్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి నేడు శాసన మండలిలో హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సహచర ఎమ్మెల్సీలు.

తనకు ఇచ్చిన అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని చట్ట సభలకు హుందాతనం తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. పేదలకోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం చట్టాలు రూపొందించే వినూత్నమైన వేదిక మీదకు వచ్చారని, చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుందని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శాసన మండలి ప్రాంగణం సందడిగా మారింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications