హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

39 రకాల వంటకాలతో దత్తన్న అలయ్ బలయ్: అతిథుల్లో బాబు, కేసీఆర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అల‌య్ బ‌ల‌య్ వైభవంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హిస్తోన్న‌ ఈ అల‌య్ బ‌ల‌య్ కార్యక్రమానికి పులువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బండారు ద‌త్తాత్రేయ మాట్లాడారు.

పేద‌వారికి విద్య, వైద్యం, ఉపాధి కోసం, బంగారు తెలంగాణ కోసం అన్ని వర్గాలు కృషి చేయాల‌ని, మ‌నుషుల‌కి మ‌ధ్య ఏ భేదాలు ఉండ‌కూడ‌ద‌నే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి పేద‌వాడికి మెరుగైన‌ విద్య, వైద్యం అందాలని ఆయ‌న కోరారు. తెలంగాణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన‌ని అన్నారు.

కేంద్రమంత్రిగా కొన‌సాగుతూ తెలంగాణ‌కు స‌హ‌కారం అందిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దడానికి, బంగారు తెలంగాణ‌కి కేంద్రం నుంచి తోడ్పాటు వ‌చ్చేలా చూస్తానని అన్నారు. ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి దిశ‌గా సాగుతోందని వ్యాఖ్యానించారు.

Bandaru Dattatreya Alai Balai Programme In Hyderabad

ఈ కార్యక్రమానికి బుధవారం మధ్యాహ్నాం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రరెడ్డి, రాంచందర్ రావు, అన్ని పార్టీల నేతలతోపాటు తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు.

కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు హాజరుకానున్నారు. కాగా, దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం సంప్రదాయ తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు.

మెనూలో వివిధ రకాల వంటలు నోరూరిస్తున్నాయి. అలయ్‌ బలయ్‌లో పాల్గొనే ప్రముఖుల కోసం 39 రకాల వినూత్నమైన వంటకాలను సిద్దం చేశారు. 800 కిలోల మ‌ట‌న్‌తో, 1400 కిలోల చికెన్‌తో మాంసాహార వంట‌కాలు త‌యారుచేశారు. అందులో 300 కిలోల త‌లకూర‌, 300 కిలోల‌ బోటీతో వంట‌కాలు క‌నిపిస్తున్నాయి.

మెనూలో ఉన్న వంట‌కాలు ఇవే:
* బగారా అన్నం 1400 కిలోలు
* తెల్ల అన్నం 400 కిలోలు
* మాంసాహార వంట‌కాల్లో లివర్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఫ్రై, రొయ్యలు, వట్టి చేపలు, బొమ్మిడాయిలపులుసు
* శాకాహార వంట‌కాల్లో టమాటా కర్రీ, ఆలు ఫ్రై, పప్పు, బెండకాయ పకోడి ఫ్రై. వంకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, సాంబారు, రసం, పచ్చిపులుసు
* పిండివంటకాల్లో జొన్న రొట్టెలు, సజ్జరొట్టెలు, అంబలి, గారెలు, సకినాలు, మొక్కజొన్నతో చేసిన గారెలు, సర్వపిండి, బచ్చాలు, అటుకులు, లడ్డూలు, మరమరాలు, పుట్నాలు ఉన్నాయి.

English summary
Union Minister Bandaru Dattareya conducts Alai Balai Programme a day after Dussehra Festival at Nampally Exhibition Grounds in Hyderabad. This festival aims to showcase the life of people in the state of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X