నిరూపిస్తే రాజీనామా చేస్తా... సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ప్రతిసవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కుత్బుల్లాపూర్ లో ప్రారంభమైన నేపథ్యంలో, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ కెసిఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన సవాల్ స్వీకరిస్తున్నానని బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లులోవ్యవసాయ మోటర్లకు మీటర్ల అంశం ఉందని, లేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కెసిఆర్ చేసిన సవాల్ కు బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు.

ముగ్గురి కబంధ హస్తాలలో బందీ అయి రోదిస్తున్న తెలంగాణా విముక్తికి ప్రజా సంగ్రామ యాత్ర
ముగ్గురి కబంధ హస్తాలలో బంధీ అయి రోదిస్తున్నతెలంగాణ తల్లికివిముక్తి కల్పించడానికే తాను ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నట్టుగా బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ను న్యూయార్క్ , సింగపూర్ చేస్తానన్న సీఎం కేసీఆర్ అది ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. చిన్న వర్షం వస్తేనే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్న బండి సంజయ్ సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్న కేసీఆర్ కు హైదరాబాద్ సిటీ లో ఉన్న గుంతలు మొత్తం చూపిస్తే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు .

కెసిఆర్ తప్పుడు పత్రాలు తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
సెప్టెంబర్ 17 వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులో మీటర్ల అంశం లేదని, కెసిఆర్ తప్పుడు పత్రాలు తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఒకవేళ విద్యుత్ సంస్కరణ బిల్లులో మీటర్ల అంశం ఉందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు.

కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుతున్నారు
అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని పట్టుకొని తిరుగుతున్నాడని పేర్కొన్నారు. కెసిఆర్ బీఆర్ఎస్ కాదు పీఆర్ఎస్ పెట్టుకుని కెఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలిచేది బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కావాలని బీజేపీపై మతతత్వ పార్టీ అని ముద్ర
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అని ముద్ర వేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి తీరుతారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేని కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తారా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications