బండి సంజయ్- కౌశిక్ రెడ్డి: పార్టీలకు అతీతంగా.. కన్నీటి నివాళి
కరీంనగర్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన మండలి సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి- రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఉప్పు-నిప్పుల్లా ఉండే ఈ ఇద్దరు నాయకులు.. తమ ఆప్త మిత్రుడి పాడెను మోశారు. కన్నీటి నివాళి అర్పించారు.
జిల్లాలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ మాజీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 39 సంవత్సరాలు. గతంలో బీజేపీ అనుబంధ విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో చురుగ్గా పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన స్వస్థలం సైదాపూర్ మండలం రాయికల్.

బీజేపీలో సుదీర్ఘకాలం పని చేసిన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఇవ్వాళ ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించారు. బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా- వారిద్దరూ మహేందర్ రెడ్డి పాడెను మోశారు. అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.
పాడి కౌశిక్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఇదే కావడంతో మహేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పని చేసిన విషయం తెలిసిందే. వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యాన్ని వహించినప్పటికీ.. ఒకే నియోజకవర్గం కావడం, ఇద్దరు దాదాపుగా సమ వయస్కులు కావడంతో కౌశిక్ రెడ్డి-మహేందర్ రెడ్డి మధ్య స్నేహితులుగా కొనసాగారు.












Click it and Unblock the Notifications