ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు: బండి సంజయ్

మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే పార్లమెంట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదించడం తథ్యం అని అన్నారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

మజ్లిస్ దేశద్రోహ పార్టీగా బండి సంజయ్ అభివర్ణించారు. మతం కోణంలో అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ మేరకు కరీంనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay Asserts Waqf Board Amendment Bill Will Proceed Despite Opposition

" ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కున్నా. 109 కేసులు నాపై ఉన్నాయి. పలుమార్లు జైలుకు పోయిన. ప్రతిసారి నన్ను కాపాడుతోంది న్యాయవాదులే. వారి సంక్షేమం కోసం అన్ని విధాలా సహకరిస్తా. న్యాయవాదుల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుండి మరో రూ.50 లక్షల సాయం చేసేందుకు నావంతు కృషి చేస్తా. వక్ఫ్ బోర్డు తీరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఈ కరీంనగర్ లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుండి ఇంటిని నిర్మించుకున్నారు. వాళ్ల తాత, ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పెట్టారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సవరణ బిల్లు రూపొందించాం. దీనిని మతం కోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకిక వాదులు చూస్తున్నారు. ఒవైసీ సహా కుహానా లౌకిక వాదులు ఎవరు అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది" అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Take a Poll

కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బండి సంజయ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్, బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు తదితరులు హాజరై ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+