లిక్కర్ స్కాం నుంచి కవితను కాపాడటానికి కేసీఆర్ స్కెచ్??
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయమున్న ఎమ్మెల్సీ కవితను కాపాడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ వేశారని, అందులో భాగమే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్ట్ చేయడమని భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి నిజాయితీ ఉంటే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కుటుంబ సభ్యలకో న్యాయం? ఇతరులకో న్యాయమా? అని ప్రశ్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల దృష్టిని మళ్లించలేరని, అన్ని విషయాలను వారు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా కవిత ఇంటి ముందు ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులను వివిధ సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ బండి సంజయ్ స్టేషన్ ఘనపూర్ మండలం పామ్నూరులో దీక్షకు దిగారు. పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నం చేయగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బండిని వాహనం ఎక్కించనీయకుండా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాహనంలో తరలిస్తున్నప్పటికీ మార్గమధ్యంలో అడ్డగించారు. వారిని బలవంతంగా పక్కకు తొలగించి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఇంటికి తరలించారు.












Click it and Unblock the Notifications