Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్.. ప్లీనరీలో ఈ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పు: బండి సంజయ్ ప్రశ్నాస్త్రాలు

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కు పలు ప్రశ్నలను సంధించారు. సీఎంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ తన ఎనిమిది సంవత్సరాల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎనిమిది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలు, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, అవినీతి, కుటుంబ పాలన వంటి అంశాలను ప్రస్తావించిన బండి సంజయ్ కెసిఆర్ అసమర్థ పాలన పై వెయ్యి ప్రశ్నలు అడిగినా తక్కువే అంటూ ఎద్దేవా చేశారు.

ప్లీనరీలో మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి: బండి సంజయ్

ప్లీనరీలో మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి: బండి సంజయ్

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా 13 తీర్మానాలు ప్రవేశ పెడతామని చెబుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా తాము అడుగుతున్న ఇరవై ఒక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ కనీసం ఈ ఇరవై ఒక్క ప్రశ్నలకు అయినా సమాధానం చెప్పి జవాబుదారీగా ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకవేళ సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను టార్గెట్ చేసిన బండి సంజయ్

ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను టార్గెట్ చేసిన బండి సంజయ్

ఒక బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్ కు సంబంధించిన ఇరవై ఒక్క ప్రశ్న వివరాల్లోకి వెళితే, 2014లో ముప్పై రెండు పేజీలు, 2018 లో పదహారు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారో లెక్క చెప్పాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు, మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ఇది వాస్తవం కాదా.. దీనికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల పదహారు రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటివరకు తెలంగాణలో ఎంత మంది విద్యావంతులైన యువతకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1 లక్షా 91 వేల ఖాళీలు ఉంటే, కేవలం 81 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగ యువతను మోసం చేయడం కాదా? మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీల మాటేమిటి?

దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీల మాటేమిటి?


దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం, దళిత బంధును విస్తరించి రాష్ట్రమంతా అమలు చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. పోడుభూములకు పట్టాలు ఇవ్వడం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడంపై ఆర్డినెన్స్ తేవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వహించడం నిజం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. కనీసం దళితున్ని మీ పార్టీ అధ్యక్షుడిగా అయినా చేస్తారా అంటూ నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మీ ప్రభుత్వం మోసగించిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. 125 ఫీట్ల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీ బంధు పథకం ఎప్పటి నుంచి ప్రవేశపెడతారని ప్రశ్నించిన బండి సంజయ్, బిసి, ఎంబీసీ కార్పొరేషన్ లకు నిధుల కేటాయింపు, ఖర్చులపై మీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా అంటూ నిలదీశారు. బీసీలకు ఇవ్వవలసిన మూడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలను ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలన్నారు.

ఇప్పటివరకు ఏ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పాలి

ఇప్పటివరకు ఏ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పాలి

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి అన్న బండి సంజయ్ దీనికి మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఎంత మేరకు నెరవేర్చారని ప్రశ్నించిన బండి సంజయ్ ఇంకా రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని, ఎప్పటిలోగా రుణమాఫీ హామీని నెరవేరుస్తారు అంటూ ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని రైతాంగాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీరు రైతులు వరి పండించకుండా అడ్డుకున్నారని, తెలంగాణ రైతాంగాన్ని నిలువునా నుంచి కేంద్రంపై మొసలికన్నీరు కార్చడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

 కేసీఆర్ అవినీతిపై చర్చకు సిద్ధమా ?

కేసీఆర్ అవినీతిపై చర్చకు సిద్ధమా ?


కెసీఆర్ జమానా - అవినీతి ఖజానా అంటూ పేర్కొన్న బండి సంజయ్ ప్రగతి భవన్ అవినీతి భవన్ గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారింది అన్నది వాస్తవం అని వెల్లడిస్తూ దీనిపై మీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 2014లో మీరు అధికారం చేపట్టిన నాడు ఉన్న మీ ఆస్తులకు, ప్రస్తుతం మీ ఆస్తులు, మీ కుటుంబ ఆస్తులు, బంధువుల ఆస్తులకు లక్షల రెట్లు వ్యత్యాసముంది నిజం కాదా దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్ట లేదా అంటూ నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల అమ్మకాలు ఇలా అనేక అంశాలలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని వీటికి సంబంధించిన ఫైల్స్ ప్రతిపక్షం ముందు పెట్టి చర్చించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

డబుల్ బెడ్ రూమ్ ల లెక్క చెప్పండి?

డబుల్ బెడ్ రూమ్ ల లెక్క చెప్పండి?

మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ గా మార్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా అంటూ ప్రశ్నించారు. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ కి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ మిషన్ కాకతీయ కార్యక్రమంలో కమీషన్ల కోసం ప్రాధాన్యం లేని చెరువులకు కూడా మరమ్మతు పనులు చేపట్టారని కాగ్ తప్పు పట్టిన మాట వాస్తవం నిజం కాదా అంటూ నిలదీశారు. 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మేనిఫెస్టో లో ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో మూడు లక్షల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని ఇక ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు? వీటి లెక్కలు చెప్పాలంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2,91,000 రాష్ట్రానికి మంజూరు చేస్తే అందులో ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు? వాటి వివరాలు ఇవ్వాలంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

తెలంగాణా నీటి వాటాలపై చర్చకు సిద్దమా ?

2014 నుండి 2022 వరకు కేంద్రం నుండి వివిధ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది.. ఎన్ని నిధులు వచ్చాయి తదితర అంశాలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు రెడీనా అంటూ ప్రశ్నించారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టిఎంసిల నీటి వాటా రావాల్సి ఉండగా, 299 టీఎంసీల నీటి వాటా ఒప్పుకుని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, నిజామాబాద్ జిల్లాలో చెరకు పరిశోధన కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఇచ్చిన హామీ ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. ఇక దేశంలోని పెట్రోలు, డీజిల్ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన బండి సంజయ్, బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో పరిస్థితి ఏంటి అన్న దానిపై చర్చించటానికి మీరు సిద్ధమేనా అంటూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ సమాధానం చెప్పాలని ఇరవై ఒక్క ప్రశ్న అస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్న సందర్భంగా ప్లీనరీలో వీటికి సమాధానం చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+