చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టగలరా..? యాదాద్రిలో కేసీఆర్ ఫోటోపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. యాదాద్రి ఆలయంలో తన ఫోటోలు పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని .. చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. శనివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సరికాదు ..
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సరికాదన్నారు సంజయ్. ఆలయంలో ఫోటోలు పెట్టుకున్న కేసీఆర్ .. చర్చి, మసీదుల్లో కూడా పెట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఆలయంలో పార్టీ పోటోలు ప్రదర్శించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తోందని హితవు పలికారు.

తొలగించి తప్పును సరిదిద్దండి ..
కరీంనగర్ వేదికగా హిందుగాళ్లు, బొందుగాళ్లు అని కామెంట్ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేవాలయంలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేవుడిపై, ధర్మం పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే యాదాద్రి వెళ్లి అర్చకులతో కలిసి ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు పరిహారంగా పాలాభిషేకం చేయాలని సూచించారు. అప్పుడే కేసీఆర్‌ను హిందూ సమాజం క్షమిస్తోందని చెప్పారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications