హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో రైతులు బికారులవుతుంటే.. కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడవుతున్నారు: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత పాదయాత్రలో 31 రోజుల్లో 383 కిలోమీటర్లు చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వచ్చందంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామన్నారు.

 రైతులు బికారులవుతుంటే.. కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడవుతున్నారు: బండి

రైతులు బికారులవుతుంటే.. కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడవుతున్నారు: బండి

పేదరికంతో ఎంతో మంది గుడిసెల్లో నివసిస్తున్నారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామన్నారు. కేసీఆర్.. ఇంటికో ఉద్యోగం అటకెక్కిందన్న ఆయన. తాము అధికారంలోకి వస్తే అన్ని ఖాళీలను బర్తీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తూ కోటీశ్వరుడు అవుతుంటే.. రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వస్తే.. : బండి సంజయ్ హామీలు

బీజేపీ అధికారంలోకి వస్తే.. : బండి సంజయ్ హామీలు

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వం వస్తే బాయిల్డ్ రైస్ కొంటామన్నారు. 4 శాతం ఉన్న మైనార్టీ రిజర్వేషన్లు తీసేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని బండి సంజయ్ అన్నారు. గంగిరెద్దులను ఆడించేవారిపైనా కేసీఆర్ ప్రభుత్వం పన్నులు విధిస్తుందేమోనని ఎద్దేవా చేశారు.

అమిత్ షా ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టు: బండి

అమిత్ షా ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టు: బండి

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో ఆకుపచ్చ జెండాలను ఎగరనివ్వమని, బంగాళాఖాతంలో కలిపిస్తేమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టులాంటిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పగటి వేషగాళ్లని ఎద్దేవా చేశారు.

English summary
Bandi Sanjay hits out at cm kcr and minister ktr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X