అయ్యయ్యో... కేసీఆర్ ఇజ్జత్ మొత్తం తీసిన బండి సంజయ్... వీడియో ఇదిగో!!
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ప్రచార పర్వాన్ని దూకుడుగా కొనసాగిస్తున్నారు. తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పిన ఆయన, తన మాటలతో కెసిఆర్ ఇజ్జత్ మొత్తం తీశారు.
కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
వన్ ఇండియా తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా కేసీఆర్ పరిస్థితిపై అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల గురించి మాట్లాడిన బండి సంజయ్ కెసిఆర్ బిడ్డ కవిత జైల్లో ఉంటే, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కవితతో కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు ములాఖత్ కాలేదు
కెసిఆర్ బిడ్డ ఏ తప్పు చేయకుంటే కనీసం ఒక్కసారి కూడా తండ్రిగా ములాఖత్ ఎందుకు కాలేదని, బిడ్డ కంటే రాజకీయాలే ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ బిడ్డ కవిత తప్పు చేసింది కాబట్టి కెసిఆర్ ఆమెను కలవడానికి వెళ్లలేదని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కెసిఆర్ అనే వ్యక్తికి తెలంగాణ గురించి,తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని బండి సంజయ్ దుయ్యబట్టారు.
తెలంగాణా ప్రజల బ్రతుకులను నాశనం చేసింది కేసీఆర్
తెలంగాణ ప్రజల బ్రతుకులను నాశనం చేసింది కేసీఆర్ అని , తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పార్టీ అని చెప్పిన కేసీఆర్, పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేసినప్పుడే, తెలంగాణపై మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. మొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి, జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్పి, ఎన్నికలు రాగానే తెలంగాణ నినాదం అందుకుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
తెలంగాణా ప్రజల సొమ్ము దోచుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే, ఆ రైతు కుటుంబాలకు రూపాయి కూడా ఇవ్వని కెసిఆర్, ఇతర రాష్ట్రాలకు వెళ్లి హంగామా చేశారని, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టారని, విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణా ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
కేసీఆర్ గురించి ప్రజలు పట్టించుకోవటం లేదు
కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల కోట్ల అప్పు అయిందని, తెలంగాణ రాష్ట్రం అధ్వాన్నమైన పరిస్థితికి వచ్చిందని, ఇందుకు కారణం కేసీఆర్ అన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలై బిచ్చమెత్తుకునే పరిస్థితికి కారణం కేసీఆర్ అన్నారు. కెసిఆర్ కు మాట్లాడే అర్హత లేదని, కేసీఆర్ గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
బాబ్బాబు అని అభ్యర్థుల కోసం అడుక్కునే స్థితి బీఆర్ఎస్ ది
దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలోనే ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేక దండం పెడతాం రండి.. బాబ్బాబు అని బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందని, బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ ఇస్తే అభ్యర్థులు వద్దని వదిలేసి పోతున్నారని ఎద్దేవా చేశారు. మెడ మీద తల ఉన్న ఎవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరన్నారు.
బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవదు
బీఆర్ఎస్ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తానేదో ముందు ముందు చక్రం తిప్పుతానని కలలు కంటున్నారని, కానీ అవేవీ నిజం కాదన్నారు. కెసిఆర్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించే పరిస్థితిలో ప్రజలు లేరని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మరిచిపోవలసిందేనని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications