కేటీఆర్ అరెస్ట్ ఖాయం - బండి సంచలనం..!!

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని పేర్కొన్నారు. కొంత కాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపైన జరుగుతున్న ప్రచారంపైన బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా అని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు పైన ప్రధాని మోదీకి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.

కేటీఆర్ అరెస్ట్ పై
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించారని, జైల్లో వేశారని, ఈ విషయాలను ఎవరూ మర్చిపోలేదని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, అయినప్పటికీ ధాటిగా వారు తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామని తెలిపారు.

Bandi Sanjay interesting comments over KTR Arrest by Revanth Govt details here

విలీనం జరగదు
బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు జరిపిందన్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని, కవిత బెయిల్ వస్తుందనడానికి, బీజేపీకి ఏం సంబంధం అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా అని నిలదీశారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని తెలిపారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని విమర్శించారు.అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు.

కాంగ్రెస్ తోనే పోటీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయితీలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు చేపట్టిందని..అందులో ఒక ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణకు ఈశాన్య రాష్ట్రాలనుంచి కనెక్టివిటీ బాగా పెరుగుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+