వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారికి అడుగడుగునా అవమానాలే.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పంచాయతీ కార్యదర్శులపై జరుగుతున్న దాడులను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

Recommended Video

Bandi Sanjay : కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడతాం | Oneindia Telugu
పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపటం ప్రభుత్వ బాధ్యత

పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపటం ప్రభుత్వ బాధ్యత

జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని అని పేర్కొన్న బండి సంజయ్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్య కృత్యంగా మారాయని, ఈ పరిస్థితులు దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగులుగా క్రమబద్దీకరించి, పే స్కేల్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని బండి సంజయ్ వెల్లడించారు.

12,765 గ్రామపంచాయతీలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుచేయాలి


గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని బండి సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12765 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుచేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నిత్య అవమానాలను ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులు

నిత్య అవమానాలను ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులు

పారిశుద్ధ్యం, హరితహారం పనులు మొదలుకొని దోమల నివారణ చర్యల వరకూ పది రకాల పనులను వారు ప్రతి రోజూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వం చేపట్టి అనేక పథకాలను గ్రామాలలో అమలయ్యే విధంగా నిత్యం శ్రమిస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. అయినప్పటికీ వారికి నిత్య అవమానాలు ఎడురవుతున్నాయన్నారు. ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదని, కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శుల భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లను క్రమబద్ధీకరించాలి

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లను క్రమబద్ధీకరించాలి


దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నామని పేర్కొన్న బండి సంజయ్ వెంటనే జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లను క్రమబద్ధీకరించడానికి, పే స్కేల్ అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది అని ఏపీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మరి బండి సంజయ్ రాసిన లేఖపై తెలంగాణా సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందించారో వేచి చూడాల్సిందే.

English summary
Bandi Sanjay wrote an open letter to CM KCR. In the letter, Bandi Sanjay strongly condemned the ongoing attacks on Junior panchayat secretaries. Sanjay demanded that their jobs be regularized and that the pay scale be implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X