వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ అండగా ఉంటామన్నారు, 317 జీవోను బొందపెడ్తాం: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

వరంగల్: రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 317 జీవోకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన నిరసన సభలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతోపాటు బండి సంజయ్ పాల్గొన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో కేసీఆర్.. : బండి సంజయ్

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో కేసీఆర్.. : బండి సంజయ్

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బదిలీలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపితే అన్ని పరిశీలించారో.. ఎన్ని పరిష్కరించారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. జనవరి 10వ తేదీ వచ్చినా 13 జిల్లాల్లో ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం అనేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని బండి సంజయ్ గుర్తు చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే 317 జీవోను బొందపెడ్తాం: బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే 317 జీవోను బొందపెడ్తాం: బండి సంజయ్

రెండేళ్ల తర్వాత ప్రజలు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతామని బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ, బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ ఉన్నా నిన్ను.. నీ కుటుంబాన్ని వదిలిపెట్టం జైలుకు పంపుతామన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టాలి. వీళ్ళందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యోగులను ఎందుకింత వేధిస్తున్నారన్నారు. ఉద్యోగం వచ్చి స్థానికత కోల్పోయి ఏడుస్తుంటే కళ్లకు నీళ్లు వస్తున్నాయన్నారు. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. సీనియర్లు జూనియర్లు పేరుతో ఉద్యోగుల్లో కొట్లాట పెట్టిస్తున్నారని కేసీఆర్‌పై

మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరని అన్నారు. ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బెదిరిస్తుందని, ఇప్పటికే మానసిక క్షోభతో ఎనిమిది మంది చనిపోయారని బండి సంజయ్ తెలిపారు. ఇంకా ఎంతమంది మరణిస్తే మీకు మనస్సు కరుగుతుందని ప్రశ్నించారు బండి సంజయ్.

ప్రధాని మోడీ అండగా ఉంటామన్నారు: బండి సంజయ్

ప్రధాని మోడీ అండగా ఉంటామన్నారు: బండి సంజయ్

కరోనా నిబంధనలను అనుసరించి దీక్ష చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తారా? ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదు మీ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని.. మీ ఆరోగ్యం ఎవ్వరూ పాడుచేసుకోవద్దు అంటూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు బండిసంజయ్‌. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవ్వరూ మద్దతు తెలిపిన వారులేరు. తెలంగాణలో13 జిల్లాల్లో పదో తేదీ వచ్చిన ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు రాలేదన్నారు. ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడు సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కమ్యూనిస్టు పార్టీతో కుమ్మక్కై చైనాకు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గడీల పాలనను బద్ధలు కొడుతుందన్నారు. మోడీ ఫోన్ చేసి చెప్పారు.. ఉద్యోగుల కోసం పోరాడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పండి అని చెప్పారని తెలిపారు. ఉద్యోగుల కోసం పోరాడుతున్న తీరు అభినందనీయం అంటూ చెబుతూ కార్యకర్తలు జాతీయ నాయకత్వం అండగా ఉంది అని భరోసా ఇవ్వండని మోడీ చెప్పారని బండి సంజయ్ తెలిపారు.

English summary
Bandi Sanjay slams CM KCR on 317 GO issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X