Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశ రాజకీయాలు తర్వాత.. ముందు వీటిపై దృష్టిపెట్టండి: కేసీఆర్ కు బండి సంజయ్ చురకలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకున్న బల్లి పడిన కలుషిత ఆహారం తినటం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో గురుకులాలలో నెలకొంటున్న దారుణమైన పరిస్థితులు పక్కనపెట్టి, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలు చేస్తానని చెప్పడం పై బండి సంజయ్ టార్గెట్ చేశారు.

వర్ధన్నపేట కలుషితాహారం ఘటనపై బండి సంజయ్ స్పందన

వర్ధన్నపేట కలుషితాహారం ఘటనపై బండి సంజయ్ స్పందన

వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని పేర్కొన్న బండి సంజయ్, ఇందులో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోందని వెల్లడించారు.

రెండు నెలల్లో అనేక ఫుడ్ పాయిజన్ ఘటనలు .. తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బండి

రెండు నెలల్లో అనేక ఫుడ్ పాయిజన్ ఘటనలు .. తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బండి

గత రెండు నెలల్లో గురుకులాలలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. గురుకులాల్లో కనీస వసతులు లేకపోవడం పై సీఎం కేసీఆర్ దృష్టి సారించడం లేదని బండి సంజయ్ అసహనం వ్యక్తంచేశారు.

గురుకులాలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచన

గురుకులాలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచన

ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న బండి సంజయ్ గురుకుల స్కూల్స్ లో కనీస వసతులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని, బిజెపి ముక్త్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు రాష్ట్రంలో గురుకులాలు పరిస్థితి పై దృష్టి సారించాలని బండి సంజయ్ హితవు పలికారు.

 దేశ రాజకీయాలు తర్వాత .. ముందు గురుకులాల్లో అవస్థలను చూడండి

దేశ రాజకీయాలు తర్వాత .. ముందు గురుకులాల్లో అవస్థలను చూడండి


సీఎం గారు... దేశ రాజకీయాలు సంగతి తర్వాత చూద్దురు కానీ,ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నా అంటూ బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సూచించారు. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే బల్లిపడిన భోజనం చేసిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వారు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+