వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలు వద్దు.. కేసీఆర్ అంతు చూద్దాం రండి: బండి సంజయ్ పిలుపు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం లేని మృగం అంటూ విరుచుకుపట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతులు మారతాయనుకుంటే.. మరింత దుర్భరమయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ రాక్షస పాలనతో రైతులు, ఉద్యోగలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపై ఆఖరి పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ చేసిన హత్యలు..

నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ చేసిన హత్యలు..

ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్క దానిని కూడా ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోవడం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇప్పటివరకు కేసీఆర్ పరామర్శించలేదన్నారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన దాఖలాల్లేవని మండిపడ్డారు.

అందరం కలిసి కేసీఆర్ అంతు చూద్దాం..

అందరం కలిసి కేసీఆర్ అంతు చూద్దాం..

ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయని ఎంతో మంది యువకులు అసువులు బాస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు బండి సంజయ్. కానీ రాష్ట్రం వచ్చి ఇన్నేళ్లైనా ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అందరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని బండి పిలుపునిచ్చారు. బీజేపీ చేస్తున్న పోరాటంలో చేతులు కలపాలని కోరారు.

 మిలియన్ మార్చ్..

మిలియన్ మార్చ్..


ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మిలియన్ మార్చ్ చేసి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2014 అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్.. లక్షా 7వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదని సంజయ్ నిప్పులు చెరిగారు. బిశ్వాల్ కమిట.. 1 లక్షా 92 వేల ఖాళీలున్నయన్నాయని చెప్పిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనపై పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

English summary
Do not commit suicide .. Let's see the end of KCR Come: Bandi Sanjay call
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X