వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలుపెరగని బాటసారి.!జూన్23 నుండి,జూలై12 వరకు బండి సంజయ్ మూడో విడత పాద యాత్ర.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వచ్చే నెల 23 నుండి జూలై 12 వరకు మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. మూడో విడత పాదయాత్ర మొత్తం 20 రోజులపాటు కొనసాగనుంది. అట్లాగే 4వ విడత పాదయాత్రను సైతం ఆగస్టులోపు పూర్తి చేయనున్నారు. మొత్తంగా 3, 4 విడతల పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలను ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ ముగింపు చేస్తారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడవడమే కాకుండా దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. రెండు విడతల పాదయాత్రల్లో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతోపాటు 66 సభలు నిర్వహించామని పేర్కొన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా, ఎంపీగా కొనసాగుతున్నందున రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, పార్లమెంట్ సమావేశాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నందున, జాతీయ నాయకత్వం సూచన మేరకు ప్రతినెలా 20 రోజులపాటు పాదయాత్ర చేస్తారని, మిగిలిన 10 రోజులు ఆయా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

Bandi Sanjay third Phase of Pada Yatra from June 23 to July 12!
English summary
As part of the Praja Sangram Yatra, BJP state president and MP Bandi Sanjay Kumar will undertake the third phase of the padayatra from July 23 to July 12 next month. The third phase of the trek will last for a total of 20 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X