బండెక్కిన బండి.. అల్లుడితో సరదాగా బేకరీకి; అక్కడ ఏం జరిగిందంటే
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఓటర్లు ఎవరికి విజయం కట్టబెట్టారో అన్నది కొందరు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధిస్తామని బిజెపి ధీమాతో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోమారు కేంద్రంలో మోడీ సర్కార్ కు పట్టం కడతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇక బండి సంజయ్ వంటి నాయకులు అయితే గెలుపుపై ధీమాతో ఉన్నారు.
అల్లుడితో సరదాగా తిరుగుతున్న బండి సంజయ్
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత సరదాగా అల్లుడితో సేద తీరుతున్నారు. టూ వీలర్ మీద కరీంనగర్ వీధుల్లో అల్లుడితో షికార్లు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్న ఆయన తన చిన్నారి అల్లుడు శ్రీనిక్ బాబుతో ఆటలాడుతున్నారు.

చిన్న పిల్లాడిలా అల్లుడితో కలిసి బేకరీల బాట పట్టిన బండి సంజయ్
మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా నియోజకవర్గం అంతా పర్యటించిన బండి సంజయ్ ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన క్రమంలో కాస్త సేద తీరుతున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీల చుట్టూ తిరుగుతూ చిన్నపిల్లాడిలా మారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేసి ప్రజల మద్దతు తనకే ఉందని ధీమాతో ఉన్నారు.
బేకరీలో బండి సంజయ్
నిన్న ఎన్నికలు ముగిసిన క్రమంలో నేడు చిన్నారి అల్లుడుతో సరదాగా షికార్లు చేస్తున్న బండి సంజయ్ ఓ బేకరీ కి వెళ్లారు. అక్కడ అల్లుడు ఏం తింటాడో అడిగి వాటిని కొనిచ్చారు. ఆపై తాను కూడా సమోసా తీసుకొని బేకరీలో అల్లుడితో సరదాగా సంభాషిస్తూ తిన్నారు. ఇక అక్కడికి వచ్చిన కొందరు యువతులు బండి సంజయ్ ని చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
బండి సంజయ్ తో సెల్ఫీలు తీసుకున్న యువతులు
ఒక ఎంపీ అయ్యుండి సామాన్యంగా బేకరీ లో వచ్చి కూర్చుని తింటున్న ఆయన స్వభావానికి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనను కలిసిన సంతోషంలో బండి సంజయ్ తో సరదాగా మాట్లాడారు. నిన్న అందరం ఓటు వేశామంటూ చెప్పిన యువతులు బండి సంజయ్ తో సెల్ఫీలు దిగారు.












Click it and Unblock the Notifications