83 రోజులు,34 నియోజకవర్గాలు,వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న బండి సంజయ్.!
జనగామ/హైదరాబాద్: తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మహాసంగ్రామ పాద యాత్ర వెయ్యికిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. మొదటి విడత, రెండవ విడత, మూడవ విడతతో కలిపి మొత్తం 83 రోజుల పాటు పాదయాత్ర చేసిన బండి సంజయ్ వెయ్యి కిలోమీటర్ల టార్గెట్ ను రీచ్ అయ్యారు. అంతే కాకుండా 34 అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న బండి సంజయ్ కుమార్ కు తెలంగాణ వ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.

నిరాటంకంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. బుదవారానికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి
తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని అధిగమించడంతో అందుకు చిహ్నంగా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లెవద్ద స్టేజీ వద్ద స్థానిక పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా 'పైలాన్'ను నిర్మించారు.

ప్రజాసంగ్రామ యాత్ర చిహ్నంగా పాలకుర్తిలోని ‘పైలాన్’.. ఆవిష్కరించనున్న బండి సంజయ్
దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లెవద్దకు బండి సంజయ్ కుమార్ చేరుకోని పైలాన్ ను ఆవిష్కరించబోతున్నారు. తమ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర వెయ్యి కిలో మీటర్ల మార్క్ దాటడంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు సిద్ధమయ్యారు. వెయ్యి బెలూన్లు ఎగరేయడంతోపాటు వెయ్యి షాట్స్ (బాణాసంచా) పేల్చనున్నారు. దీంతోపాటు డప్పు వాయిద్యాలతో, కార్యకర్తల నృత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

భారీ ఎత్తున సంబురాలు.. పండుగ వాతావరణంలో కార్యకర్తలు
తొలివిడత నుండి నేటిదాకా మొదటి విడత పాదయాత్ర ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. తొలివిడతలో మొత్తం 36 రోజులపాటు పాదయాత్ర చేసి 438 కిలో మీటర్లు నడిచారు. 19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అట్లాగే రెండో విడత పాదయాత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మే 14న ముగించారు. మొత్తం 31 రోజులపాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కిలొ మీటర్లులు నడిచారు.

వెయ్యి బెలూన్లు.. వెయ్యి క్రాకర్స్ షాట్స్.. డప్పు వాయిద్యాలతో కమల దండు హంగామా
తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై నేటికి 15 రోజులు పూర్తి కావస్తోంది. పైలాన్ ఆవిష్కరించే సమయానికి 883 కిలో మీటర్లు నడక పూర్తయింది. గురువారానికి పాలకుర్తి నియోజకవర్గంలోని వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటి 1001 కిలో మీటర్ల లోకి అడుగు పెట్టడం గమనార్హం. ఈ 82 రోజుల పాదయాత్రలో బండి సంజయ్ అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వివిధ సమస్యలపై వేలాది దరఖాస్తులను స్వీకరించారు. వాటి పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసారు బండి సంజయ్ కుమార్.












Click it and Unblock the Notifications