వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేత పీవీపీపై మరో కేసు - బీజేపీ నాయకురాలి కుమార్తె ఫిర్యాదు : ధ్వంసం..బెదిరింపులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వైసీపీ నేత...ప్రముఖ వ్యాపార వేత్త పోట్లూరి వరప్రసాద్‌పై మరో కేసు నమోదైంది. ఆయన పైన బీజేపీ మహిళా నేత కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. పీవీపీ పైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారు. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది.

జేసీబీతో ధ్వంసం చేసారంటూ

జేసీబీతో ధ్వంసం చేసారంటూ

దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఓ విల్లాను డికే అరుణ కుమార్తె శృతి రెడ్డి కొనుగోలు చేశారు. ఇంటి మరమత్తుల్లో భాగంగా ప్రహరి గోడ నిర్మాణం చేపట్టారు. అయితే శృతిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను సైతం పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబితో ధ్వంసం చేయించారు. దీన్ని ప్రశ్నించిన శృతిరెడ్డిపై బెదిరింపులకు పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది.

పీవీపీతో సహా అనుచరులపై

పీవీపీతో సహా అనుచరులపై

దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. పీవిపీ తన రియల్ కంపనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి విక్రయించారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటుండడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఓ రినోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడంతో ఆ కేసు సైతం వివాదస్పదమైంది.

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ డీకే అరుణ || Oneindia Telugu
ఫిర్యాదు - కేసు నమోదు

ఫిర్యాదు - కేసు నమోదు

దీంతో ఆకేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అదే తరహాలో మరో కేసు ఇప్పుడు నమోదైంది. పీవీపీ తో పాటుగా ఆయన అనుచరులపైన IPC 447,427,506,509 r/w34 కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

పీవీపీ 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని ఆయన పైన గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయంగా ఆయన అంత యాక్టివ్ గా లేరు. ఇక, ఇప్పుడు పీవీపీ పైన బీజేపీ మహిళా నేత కుమార్తె ఫిర్యాదు చేయటం... కేసు నమోదు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు కారణమవుతోంది.

English summary
Hyderabad Police filed case against YSRCP leader PVP based BJP leader DK Aruna Daughter complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X