తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ సంబురం... అక్టోబర్ 2 నుంచి ఆడబిడ్డలకు చీరల పంపిణీ...

తెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలవనుంది. శుక్రవారం(అక్టోబర్ 1) ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఈ పూల పండుగ జరగనుంది.తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మలు పేర్చి... వాటిని ఒక్కచోట చేర్చి ఆట,పాటలతో సంబరంగా పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయనున్నట్లు సమాచారం.ఈ సంవత్సరం మొత్తం 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుంద‌రంగా తీర్చిదిద్దారు. మొత్తం 810 ర‌కాల చీర‌ల‌ను పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జ‌రి అంచుల‌తో, 100 శాతం పాలిస్ట‌ర్ ఫిలిమెంట్, నూలుతో వీటిని తయారుచేసినట్లు సమాచారం.

bathukamma sarees will be distributed from october 2nd in telangana

ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కొన్ని గోదాములను ఎంపిక చేసి బతుకమ్మ చీరలను అక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అన్ని జిల్లాలు,గ్రామాలకు చీరలను తరలించనున్నారు. గ్రామ,వార్డు స్థాయి కమిటీల ద్వారా ఆ చీరలను పంపిణీ చేయనున్నారు. 2017లో 2017లో 95, 48,439 మంది మ‌హిళ‌ల‌కు, 2018 లో 96,70,474 మందికి, 2019 లో 96,57,813 మందికి, 2020 లో 96,24,384 మంది మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ ఏడాది కోటి మందికి పైగా చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నట్లు సమాచారం.

రేపటి నుంచి బతుకమ్మ పండుగ :

1 అక్టోబర్ 2021 శుక్రవారం, దశమి రోజు బొడ్డెమ్మ పండగ, మొదటి బతుకమ్మగా 'ఎంగిలి పూల బతుకమ్మ'ను పేరుస్తారు.

రెండవ బతుకమ్మ " అటుకుల బతుకమ్మ" : 6 అక్టోబర్ 2021 బుధవారం, మహాలయ అమావాస్య రోజు... తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

మూడవ బతుకమ్మ 'ముద్దపప్పు బతుకమ్మ' : 7 అక్టోబర్ 2021 గురువారం, ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

నాల్గవ బతుకమ్మ 'నానబియ్యం బతుకమ్మ ' : 8 అక్టోబర్ 2021 శుక్రవారం, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

ఐదవ బతుకమ్మ 'అట్ల బతుకమ్మ' : 9 అక్టోబర్ 2021 శనివారం, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ బతుకమ్మ 'అలిగిన బతుకమ్మ' : 10 అక్టోబర్ 2021 ఆదివారం, ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

ఏడవ బతుకమ్మ 'వేపకాయల బతుకమ్మ' : 11 అక్టోబర్ 2021 సోమవారం, బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ బతుకమ్మ 'వెన్నముద్దల బతుకమ్మ ' : 12 అక్టోబర్ 2021 మంగళవారం, నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

తొమ్మిదో రోజు 'సద్దుల బతుకమ్మ ' : 13 అక్టోబర్ 2021 బుధవారం, ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+