బీసీ డిక్లరేషన్ ఓ సాహసోపేత కార్యక్రమం.!ప్రశంసించిన డి.కె.అరుణ, వివేక్ వెంకటస్వామి.!
హైదరాబాద్ : గురువారం ఓబీసీ సమ్మేళనంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ కు బీజేపి జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామి శుభాభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ బీసీలకు సీఎం చంద్రశేఖర్ రావు చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్ సరిచేస్తుందన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ డిక్లరేషన్ లో ప్రకటించిన అంశాలన్నింటినీ తప్పక అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో నామమాత్రంగా మారిన బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడం కమిషన్ ను పటిష్ట పర్చడమే బీజేపి లక్షమన్నారు. బీసీ జనాభా అధారంగా బడ్జెట్ కేటాయింపులు, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం వంటి అన్నీ కార్యక్రమాలు వెనకబడిన వర్గాలకు మేలు చేస్తాయన్నారు డీకే అరుణ.

ఆరు నెలల తర్వాత తెలంగాణలో బిజెపి ఏర్పడడం ఖాయమని, బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తో బీసీలే కాకుండా అన్ని వర్గాలకు మంచి రోజులు వస్తాయన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు వివేక్ తెలిపారు.












Click it and Unblock the Notifications