రాజీవ్-శ్రవణ్‌ల తీరు: పోలీసుల విస్మయం, శిరీష-తేజస్వినిలను అలా వదిలించుకోవాలని..
బ్యూటీషియన్ శిరీష మృతి కేసుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక ప్రాథమిక నివేదిక అందింది. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక ప్రాథమిక నివేదిక అందింది. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిన విషయం తెలిసిందే.
కాగా, శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లు పోలీసుల విచారణలో ఒకే మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పి, పోలీసులకు విసుగు తెప్పించారని కూడా సమాచారం.

ఎలా విచారించినా.. పోలీసుల విస్మయం
ఓ విధంగా చెప్పిందే.. చెప్పి తమకు అంతకుమించి ఏం తెలియదని చెప్పారు. పోలీసులు వారిని రెండు రోజులు విచారించిన విషయం తెలిసిందే. శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని భావించలేదని వారు పోలీసులకు చెప్పారు. ఇద్దరినీ కలిపి, వేర్వేరుగా దశలవారీగా ప్రశ్నించినా వారి నుంచి ఒకేవిధమైన సమాధానం రావటం పోలీసు అధికారులనూ విస్మయానికి గురి చేసిందని తెలుస్తోంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
అరెస్టుకు ముందు ఇద్దరు నిందితులు ఎవరికివారే ఎదుటి వారిపై తప్పును మోపేలా ఆరోపించుకున్నారని చెబుతున్నారు. అరెస్టైన అనంతరం విచారణలో మాత్రం దానికి భిన్నంగా కూడబలుక్కున్నట్టు ఒకే వాదన వినిపించటం ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులే ఆశ్చర్యపోతున్నారంటున్నారు.

డ్రామాలు.. కాదు
రాజీవ్‌ను ఏ 2 నిందితుడిగా చేర్చటంపై శిరీష బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కీలకమైన రాజీవ్‌ను తప్పించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇద్దరు నిందితులు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎస్సైని ఆశ్రయించారని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఎస్సై తనపై ఆత్యాచారయత్నం చేయడంతో ఆమె మనస్తాపానికి గురయిందని తేలిందని సమాచారం.

శిరీష, తేజస్వినిలను కూడా అలాగే వదిలించుకోవాలని..
రాజీవ్, శ్రవణ్ ఇద్దరూ అమ్మాయిల వ్యామోహంలో చాలామందిని మోసగించారని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. గతంలో మహిళలతో తలెత్తిన వివాదాలను పోలీసు కేసులని భయపెట్టి బయటపడ్డారని, అదే విధంగా శిరీష, తేజస్వినిలను కూడా వదలించుకోవాలనే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం.

ఎస్సై ఫోన్ రికార్డులు
ఇదిలా ఉండగా, ఆత్మహత్య చేసుకున్న శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి, నిందితులు రాజీవ్, శ్రవణ్ రెండునెలలుగా మాట్లాడిన ఫోన్ నెంబర్ల డేటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు, ఎస్సై తన వ్యక్తిగత ఫోన్ నెంబరు ద్వారా సాగించిన సంభాషణలను తాను రికార్డు చేసిన విషయం వెలుగు చూసినట్లుగా సమాచారం. ఆ మొబైల్ ఎక్కడుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications