బీరయ్య చేరిక: బాబుకు స్వల్ప ఊరట (పిక్చర్స్)
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తదితరులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన నేపథ్యంలో తెరాస నేత జి. బీరయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వల్ప ఊరట లభించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో టీఆర్‌ఎస్ నేత జి. బీరయ్య యాదవ్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. బీరయ్య యాదవ్ 12 ఏళ్ళుగా టీఆర్‌ఎస్‌లో క్రియాశీలక పాత్ర వహిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
పన్నెండేళ్లుగా చిత్తశుద్ధితో పార్టీకి పనిచేస్తున్నా కేసీఆర్ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీరయ్య యాదవ్ ఆరోపించారు. ఆయనతో పాటు పలువురు మెదక్ నియోజకవర్గ నేతలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.

బాబుకు స్వల్ప ఊరట
తెరాస నాయకుడు బీరయ్య యాదవ్ తన అనుచరులతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది.

తుమ్మల అటు పోవడంతో..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెరాసలో చేరిన రోజే బీరయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబుపై ప్రశంసలు..
చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని బీరయ్య యాదవ్ ప్రశంసించారు.

కెసిఆర్‌పై విమర్శలు..
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ ప్రజలకు ఉన్న భర్మలు తొలగిపోతున్నాయని బీరయ్య యాదవ్ అన్నారు.

2019లో టిడిపి వస్తుంది...
2019లోచంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని బీరయ్య యాదవ్ అన్నారు.












Click it and Unblock the Notifications