50 లక్షలను డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన బిచ్చగాడు

వికారాబాద్ :పెద్ద నగదు రద్దుతో కొత్త నగదు కోసం బ్యాంకులకు జనం బారులు తీరుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లాలో ఓ బిచ్చమెత్తుకొనే వ్యక్తి బ్యాంకు అధికారులతో పాటు జనాన్ని షాక్ కు గురిచేశాడు. పెద్ద ఎత్తున నగదును మార్చుకోవడం కోసం బ్యాంకుకు రావడంతో ఆయనను చూసి బ్యాంకు అధికారులు ఖంగుతిన్నారు.

వికారాబాద్ లోని బ్యాంకులో నగదు మార్పిడి కోసం జనం బారులు తీరారు. ఇంతలో ఓ బిచ్చమెత్తుకొనే వ్యక్తి కూడ ఈ క్యూలో వచ్చి నిల్చున్నాడు. ఇతర ఖాతాదారుల మాదిరిగానే అతను కూడ బ్యాంకులోకి నగదు మార్పిడి వచ్చాడు. బ్యాంకు అధికారులతో పాటు ఖాతాదారులకు ఆయన చుక్కుల చూపాడు.

తన వద్ద ఉన్న 50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని బ్యాంకు అధికారులను కోరాడు. అతను తెచ్చిన డబ్బులను చూడగానే బ్యాంకు అధికారులు నివ్వెరపోయారు. ఖాతాదారులు కూడ బిచ్చమెత్తుకొనే వ్యక్తి వద్ద ఇంత డబ్బా అని ఆశ్చర్యపోయారు.ఇంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు కావాలని బ్యాంకు అధికారులు కోరారు వెంటనే ఆయన తన జేబులో నుండి పాన్ కార్డును తీసి బ్యాంకు అధికారులకు ఇచ్చాడు.

 beggar went to bank for deposit 50 lakhs

ఒకేసారి 50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి నిబంధనలు ఒప్పకోవని బ్యాంకు అధికారులు చెప్పారు.అయితే ఈ నగదు ఎలా వచ్చిందో ఆధారాలు ఇస్తే ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అంగకీరిస్తామని బ్యాంకు అధికారులు ఆయనకు చెప్పారు. తన రెండు ఎకరాల వ్యవసాయభూమిని విక్రయించగా తనకు డబ్బు వచ్చిందని ఆ వ్యక్తి బ్యాంకు అధికారులకు చెప్పాడు.అయితే దీనికి సంబందించిన పత్రాలను తీసుకురావాలని సూచించడంతో పత్రాల కోసం ఆయన బ్యాంకు నుండి వెళ్ళిపోయారు.

పెద్ద నగదు రద్దుతో కొత్త నగదు కోసం బ్యాంకులకు జనం బారులు తీరుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లాలో ఓ బిచ్చమెత్తుకొనే వ్యక్తి బ్యాంకు అధికారులతో పాటు జనాన్ని షాక్ కు గురిచేశాడు. పెద్ద ఎత్తున నగదును మార్చుకోవడం కోసం బ్యాంకుకు రావడంతో ఆయనను చూసి బ్యాంకు అధికారులు ఖంగుతిన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+