రాహుల్ బిజీ, సొంత నేతలకు ఇష్టం లేదు: ఇబ్బందిపడుతున్న రేవంత్!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభ వాయిదాలు పడుతూ వస్తోంది. తొలుత నవంబర్ 9న అన్నారు. ఆ తర్వాత మరో తేదీకి మారింది. ఇప్పుడు నవంబర్ 19న లేదా 20న తేదీల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది.

  L Ramana Challenges Revanth Reddy : సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా | Oneindia Telugu

  అక్టోబర్ 25న రాహుల్ ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తారని, ఆ నెలాఖరులోనే తెలంగాణ పర్యటన ఉండనుందని తొలుత చెప్పారు. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వాయదా పడుతున్నాయి.

  గిరిజన గర్జన

  గిరిజన గర్జన

  తొలుత మహబూబాబాద్ జిల్లాలో గిరిజన గర్జన పేరుతో సభ ఉంటుందని భావించారు. అది వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 9న గిరిజన గర్జనతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ గర్జన వరంగల్‌లో ఉంటుందని చెప్పారు. అది కూడా జరగలేదు.

  అదేమిటో చెప్పాలి, ఇచ్చేద్దామా: రేవంత్‌కు రమణ సవాల్, మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం

  ఆ సభ పైనా అనుమానాలు

  ఆ సభ పైనా అనుమానాలు

  ఇప్పుడు నవంబర్ 19న లేదా 20న సభ ఉంటుందని చెబుతున్నప్పటికీ దాని పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్, మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాక వారు కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. రాహుల్ సభ ఖరారు అయితే, అక్కడి నుంచే కార్యక్రమాలు మొదలు పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

  రేవంత్ ఇబ్బంది

  రేవంత్ ఇబ్బంది

  కానీ రాహుల్ గాంధీ సభ వాయిదా పడుతుండటంతో రేవంత్‌ ఇబ్బందిపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ సభ నుంచే కాంగ్రెస్ లీడర్‌గా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కానీ ఆయన ఆశలు నెరవేరడం లేదు.

  గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ బిజీ

  గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ బిజీ


  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీగా ఉన్నారు. ఆయన సభ వాయిదాకు ఇది ముఖ్య కారణం. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ప్రస్తుతం పెద్దగా ఆసక్తితో లేరని తెలుస్తోంది.

  ఆ నేతలు కూడా అసంతృప్తిగా

  ఆ నేతలు కూడా అసంతృప్తిగా

  రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్న నేతలు కొందరు ఉన్నారు. పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు రాహుల్ సభతో మరింత హైలెట్ అవుతారని, అది తమకు ఇబ్బందిగా మారుతారని భావిస్తున్నారట. కాబట్టి పార్టీలోని కొందరు కూడా ఇప్పటికిప్పుడు సభ పట్ల ఆసక్తిగా లేరని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Behind AICC vice president Rahul Gandhi public meeting postpone in Telangana.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి