పవన్ కళ్యాణ్‌పై విమర్శలు, షాకిచ్చే కౌంటర్లు: జనసేనానిపై టి-బీజేపీ ఆగ్రహం వెనుక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన వల్ల తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తున్న ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ఎదురుదాడి చేస్తున్నాయి.

చదవండి: ఢిల్లీలో వైసీపీ కార్నర్, అందుక జగన్ భేటీ!: బాబు చెప్పారు కానీ.. బీజేపీపై ధర్మాన ఆగ్రహం

పవన్ తమతో ఎట్టి పరిస్థితుల్లో కలవడని తెలిసి ఇప్పటికే ఏపీలో వైసీపీ ఆయనను సమయం వచ్చినప్పుడల్లా ఆయనను టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం, బీజేపీలు ఆచితూచి మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు మౌనం వహించింది.

పవన్ కళ్యాణ్‌పై ఏపీలో బీజేపీ అలా, తెలంగాణలో ఇలా

పవన్ కళ్యాణ్‌పై ఏపీలో బీజేపీ అలా, తెలంగాణలో ఇలా

పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా ఆచితూచి స్పందిస్తున్నారు. గతంలో హోదాపై నిలదీసినప్పుడు మాత్రం నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఆయనపై మౌనం వహిస్తుండగా సమయం వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు

కిషన్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు

పవన్ హావభావాలు చూస్తే నవ్వొస్తుందని, చిరంజీవి సోదరుడు కాబట్టి ఆయన సినిమాల్లోకి సులభంగా ప్రవేశించాడని, నటన కూడా రాదని, మీడియా మద్దతుతో రాజకీయంగా వద్దామనుకుంటున్నాడని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్

కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్

కిషన్ రెడ్డి మాటలకు కొందరు అభిమానులు ధీటుగా స్పందిస్తున్నారు. చిరంజీవి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తనను తాను నిరూపించుకున్నాడని, నటనకు, రాజకీయాలకు సంబంధం ఏమిటని కొందరు అంటున్నారు.

నటన రాదనడంపై

నటన రాదనడంపై

పవన్ కళ్యాణ్‌కు నటన రాదని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారని, దానికి కూడా దిమ్మతిరిగే షాకిస్తున్నారు. అవును.. ఆయన చెప్పింది నిజమేనని, పవన్‌కు నటన రాదని, వాస్తవంలో జీవించడమే ఆయనకు ఇష్టమని, అందుకే సమస్యల పట్ల పోరాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌పై బీజేపీ కోపం అందుకే

పవన్ కళ్యాణ్‌పై బీజేపీ కోపం అందుకే

పవన్ 2014లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలకు ప్రచారం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున ఆయన బీజేపీని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఏపీలో చంద్రబాబుకు, తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్నారు. ఇటీవల పవన్ పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నో సమస్యలు ఉంటే పవన్ ప్రశంసించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదగాలనుకుంటున్న బీజేపీ దీనిని జీర్ణించుకోవడం లేదు. అందుకే పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్‌ను ఆయన ప్రశంసించడంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Behind Telangana Bharatiya Janata Party leaders angry at Jana Sena chief Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి