ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా వెనుక బీఆర్ఎస్ కు షాకిచ్చే బడా వ్యూహం!!

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల ధర్నా వెనుక బీఆర్ఎస్ కు షాకిచ్చే బడా వ్యూహం ఉంది.

తెలంగాణా: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్న బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న ఆమె బిఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ను జాతీయస్థాయిలో దెబ్బతీయడానికి కొత్త ప్లాన్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పై పోరుబాట పట్టనున్నారు. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

బీఆర్ఎస్ కు కౌంటర్ గా షర్మిల ఆందోళనలు

బీఆర్ఎస్ కు కౌంటర్ గా షర్మిల ఆందోళనలు


ఇప్పటికే ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన షర్మిల పాదయాత్రను అటు బి ఆర్ ఎస్ నేతలు, ఇటు పోలీసులు అడ్డుకోగా, తాజాగా షర్మిల ఊహించని విధంగా అనేక అంశాలపై ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో పోరాడితే, షర్మిల హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణలో అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసన దీక్షకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని ఆందోళన చేసి నల్ల రిబ్బన్ లతో నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు ఆమెను అప్పుడు అరెస్టు చేశారు.

కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై విచారణకు షర్మిల డిమాండ్

కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై విచారణకు షర్మిల డిమాండ్

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆందోళన చేపడితే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళన చేశారు. ఇక తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీలో భారీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు మహా ప్రదర్శన చేపట్టనున్నారు. అసలు ఎందుకు వైయస్ షర్మిల ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేపట్టి, పార్లమెంటును ముట్టడించాలన్న ఆలోచనలో ఉన్నారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైయస్ షర్మిల ప్రతిపక్ష పార్టీలకు సైతం విజ్ఞప్తి చేశారు.

అవినీతి జరిగితే కేంద్రానికి కనిపించడం లేదా: షర్మిల ప్రశ్న

అవినీతి జరిగితే కేంద్రానికి కనిపించడం లేదా: షర్మిల ప్రశ్న

కాళేశ్వరం ప్రాజెక్టులో కెసిఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపిస్తున్నారు. వైయస్సార్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటినే కాళేశ్వరం లెక్కల్లో చూపిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష ఇరవై వేల కోట్ల అంచనాలను పెంచడంలో అవినీతి లేదా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇంత అవినీతి జరిగితే కేంద్రానికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టుపై విచారణ జరపాల్సిన అవసరం లేదా అంటూ పేర్కొన్న ఆమె దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రయత్నానికి చెక్ పెట్టే పనిలో షర్మిల

కేసీఆర్ ప్రయత్నానికి చెక్ పెట్టే పనిలో షర్మిల

మెగా కంపెనీతో కుమ్మక్కై దాదాపు 70 వేల కోట్ల అవినీతికి సీఎం కేసీఆర్ తెరతీసారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోని అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయనున్న షర్మిల, బిఆర్ఎస్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో దెబ్బకొట్టి, దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయనున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని వడివడిగా అడుగులు వేస్తుంటే ఆమె ఆయన ప్రయత్నానికి చెక్ పెట్టే పనిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+