తెరపైకి నిషిత్ కేసు: అది కావాలంటే.. పోలీసులకు బెంజ్ కంపెనీ షాక్
నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజారవిచంద్ర ప్రమాదం కేసులో విచారణ కొనసాగుతోంది.నిషిత్ నడిపిన వాహన వివరాలు కావాలని పోలీసులు కోరగా.. బెంజ్ సంస్థ నుంచి విస్తుగొలిపే జవాబు వచ్చింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజారవిచంద్ర ప్రమాదం కేసులో విచారణ కొనసాగుతోంది. నిషిత్ నడిపిన వాహన వివరాలు కావాలని పోలీసులు కోరగా.. బెంజ్ సంస్థ నుంచి విస్తుగొలిపే జవాబు వచ్చింది.
దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. రహస్యంగా ఉంచాల్సిన దర్యాఫ్తు వివరాలను ఇవ్వడం ఎలా కుదురుతుందని వారు అంటున్నారని సమాచారం.

బెంజ్ అడగడంపై పోలీసుల ఆశ్చర్యం
వాహనానికి సంబంధించిన వివరాలు కావాలంటే కేసు దర్యాప్తు వివరాలు, పోస్టుమార్టం నివేదిక పంపాలని బెంజ్ కంపెనీ కోరింది. దీనిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మే 10వ తేదీ ఉదయం నిషిత్ ప్రయాణిస్తోన్న బెంజ్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

కంపెనీ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం..
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కారు అయినప్పటికీ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కార్ల కంపెనీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు..
ప్రమాద సమయంలో సకాలంలో బెలూన్లు తెరుచుకున్నాయా? ఒకవేళ బెలూన్లు ఓపెన్ అయితే వారి ప్రాణాలు పోవటానికి కారణాలేంటి? వాహనంలో సాంకేతిక లోపం తలెత్తిందా? తదితర వివరాలు ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు బెంజ్ కార్ల కంపెనీకి గతంలో లేఖ రాశారు.

పోలీసుల అవాక్కు
వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల మెయిల్ ద్వారా విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అడగడంతో పోలీసులు అవాక్కయ్యారు. రహస్యంగా ఉంచాల్సిన వివరాలు ఇవ్వడంపై తర్జన భర్జన పడుతున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులు నడుచుకోనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications