భద్రాచలానికి మహర్దశ.. అయోధ్యను తలపించేలా!
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర మూర్తి ఆలయానికి మహర్దశ పట్టనుంది. సాక్షాత్తు అయోధ్యలోని రామాలయాన్ని తలపించేలా భద్రాద్రి రామయ్య ఆలయాన్ని నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, తన రాజకీయ ప్రస్థానం ఖమ్మం జిల్లా నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు.
అయోధ్యను తలపించేలా భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తాం
ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు వరాలను ప్రకటించారు. ఇందులో అత్యంత ముఖ్యమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గురించి కీలక ప్రకటన చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలను అద్భుతంగా నిర్మిస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయోధ్యను తలపించేలా భద్రాద్రి ఆలయాన్ని నిర్మించి తీరుతాం అన్నారు.

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి భూసేకరణ
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భద్రాచలానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి భూ సేకరణ జరుగుతోందని ఆయన అన్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత అత్యద్భుతంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర మూర్తి ఆలయాన్ని నిర్మిస్తామని బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
భద్రాచలానికి మహర్దశ
దీంతో స్థానికులు సీఎం ప్రకటనతో భద్రాచలానికి మహర్దశ పట్టబోతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చారిత్రక వైభవం, ప్రాశస్త్యం ఉన్నటువంటి భద్రాచలం ఆలయాన్ని, అయోధ్య రామాలయం తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఖమ్మం జిల్లా వాసులకు సంతోషం కలిగించింది. ఇక ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి
మంత్రి ఉత్తమ్ కుమార్ సారథ్యంలో ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతూ, ఎన్టీఆర్ ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షలాది రేషన్ కార్డులు ప్రజలకు అందించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి కూడా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామన్న సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేసి, గృహ నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల పైన కుట్ర చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని ఆయన అన్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications